Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్ తర్వాత దేశమంతా ఒక్కటే ప్రశ్న; ChatGPT ఏం చెప్పింది!

మానవ మెదడును మించిన శక్తి ఈ భూమ్మీద మరొకటి లేదు. ఆ మేథస్సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తయారు చేసింది. కానీ ఏఐ వచ్చిన తర్వాత మనమే ఆలోచించడం కొంచెం తగ్గించుకున్నాం. చిన్న విషయం నుంచి పెద్ద విశ్లేషణ వరకు అన్నింటికీ చాట్‌బాట్‌లనే అడుగుతున్న పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.

ఈ ధోరణి తాజాగా కేంద్ర బడ్జెట్ విషయంలో మరింత స్పష్టంగా కనిపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వెంటనే, చాలా మంది విశ్లేషకులు ఏమంటారో అని ఎదురు చూడగా... మరికొందరు మాత్రం నేరుగా ChatGPTని ఆర్థిక నిపుణుడిలా భావించి బడ్జెట్‌పై అభిప్రాయం అడిగారు. ఆ సమాధానాలు చూసిన కొందరికి నవ్వు ఆగలేదు, మరికొందరికి ఆలోచన వచ్చింది.

ChatGPT Analyzes Union Budget 2026-27 Strengths Weaknesses Impact On Economy And Common Man

నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత, ChatGPT బడ్జెట్ సానుకూలాలు, ప్రతికూలాలు, సామాన్యుడిపై ప్రభావం, దీర్ఘకాలిక వృద్ధి గురించి సమగ్రంగా విశ్లేషించింది. ఆ విశ్లేషణను సాదాసీదాగా చూస్తే ఇలా ఉంది.

ఆర్థిక వ్యవస్థకు మంచి చేసే అంశాలు

  • ప్రభుత్వం ఈసారి కూడా మౌలిక వసతులపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని నిర్ణయించింది. మూలధన వ్యయాన్ని ₹11.2 లక్షల కోట్ల నుంచి ₹12.2 లక్షల కోట్లకు పెంచింది. అదే సమయంలో ద్రవ్య లోటును GDPలో 4.3 శాతానికి తగ్గించింది. అంటే అప్పులు పెంచకుండా అభివృద్ధి పనులు కొనసాగించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల రహదారులు, రైళ్లు, మౌలిక సదుపాయాలు పెరిగి ఉద్యోగాలు వస్తాయని నిపుణుల అంచనా.
  • తయారీ రంగంలో కూడా ఈ బడ్జెట్ కొత్త దిశ చూపించింది. కేవలం సబ్సిడీలకే పరిమితం కాకుండా, సెమీకండక్టర్లు, బయోఫార్మా, అరుదైన ఖనిజాలు, రసాయన పార్కులు వంటి అధిక విలువ కలిగిన రంగాలపై దృష్టి పెట్టింది. దీని వల్ల భారత్‌లో పరిశ్రమలు బలపడతాయని భావిస్తున్నారు.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) రుణాల సమస్య పరిష్కరించేందుకు నిర్మాణాత్మక మార్పులు ప్రకటించారు. రుణాలు త్వరగా అందేలా కొత్త విధానాలు తీసుకొచ్చారు. ఇది చిన్న వ్యాపారాలకు ఊరటనిచ్చే అంశం.
  • ఇక సేవారంగానికి కూడా బడ్జెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఆరోగ్యం, యానిమేషన్, గేమింగ్, డిజైన్, పర్యాటకం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యం ఉంది. తయారీ ఒక్కటే వృద్ధికి మార్గం కాదని, సేవారంగం కూడా కీలకమనే వాస్తవాన్ని ఈ బడ్జెట్ అంగీకరించింది.
  • పన్నుల విషయంలో పెద్ద సంచలన ప్రకటనలు లేకపోయినా, పన్ను విధానాన్ని సులభతరం చేయడంపై దృష్టి పెట్టారు. రిటర్నులు, అసెస్‌మెంట్లు, వివాదాల పరిష్కారంలో సరళత తీసుకురావడం దీర్ఘకాలంలో ప్రజలకు ఉపయోగపడుతుంది.

లోపాలు, విమర్శలు

  • ఈ బడ్జెట్‌లో నేరుగా వినియోగాన్ని పెంచే చర్యలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆదాయపు పన్నుల్లో భారీ తగ్గింపులు, నగదు బదిలీలు లేవు. పెట్టుబడుల వల్ల వృద్ధి వస్తోంది కానీ ప్రజల ఖర్చు పెరగకపోతే ఆ వృద్ధి మందగించే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంది.
  • షేర్ మార్కెట్‌కు సంబంధించిన పన్నులు కొంత కఠినంగా మారాయి. ఫ్యూచర్స్, ఆప్షన్‌లపై పన్నులు పెరగడం వల్ల చిన్న పెట్టుబడిదారుల ఉత్సాహం తగ్గొచ్చని అంచనా.
  • అలాగే చాలా పెద్ద ప్రాజెక్టులు ప్రకటించినా, అవి సరిగ్గా అమలవుతాయా అనే సందేహం ఉంది. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థల సమన్వయం లేకపోతే ఫలితం తగ్గిపోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
  • GST సంస్కరణలపై ఈసారి స్పష్టత లేకపోవడం కూడా మరో లోపంగా పేర్కొంటున్నారు.

సామాన్యుడికి ఉపయోగపడే అంశాలు

  • టైర్-2, టైర్-3 నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వల్ల ఉద్యోగాలు, భూముల విలువ, రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. ఇది క్రమంగా మధ్యతరగతి జీవనంపై మంచి ప్రభావం చూపుతుంది.
  • విదేశీ విద్య, వైద్యం, ప్రయాణాలపై TCS తగ్గింపు మధ్యతరగతికి ఊరట. పన్ను రిటర్న్ ప్రక్రియ సులభం కావడం కూడా ఉపశమనమే.
  • క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వంటి నిర్ణయాలు ఆరోగ్య ఖర్చులతో ఇబ్బంది పడే కుటుంబాలకు ఉపయోగపడతాయి.
  • వ్యవసాయంలో అధిక విలువ కలిగిన పంటలు, చేపల పెంపకం, పశుపోషణపై దృష్టి పెట్టడం దీర్ఘకాలంలో రైతులకు మేలు చేస్తుంది.

మొత్తం మీద తీర్పు

మొత్తంగా ఇది పెట్టుబడుల ఆధారంగా రూపొందించిన, దీర్ఘకాల వృద్ధికి ఉపయోగపడే బడ్జెట్. తక్షణ వినియోగానికి పెద్దగా ఊరట ఇవ్వకపోయినా, పరిశ్రమలు, సేవారంగం, మౌలిక వసతులపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, అన్నీ సరిగ్గా అమలవుతాయా లేదా అన్నదే ఈ బడ్జెట్ విజయాన్ని నిర్ణయించే కీలక అంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+