డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ!
మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా భారీ లాభాలను తెచ్చిపెట్టే బిజినెస్ కోసం చూస్తున్నారా? అయితే గాడిదల పెంపకం మీకు ఓ అద్భుతమైన అవకాశంగా మారవచ్చు. కేంద్ర ప్రభుత్వం తన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) కింద గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించడానికి 50శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. అంటే మీ ప్రాజెక్ట్ ఖర్చు రూ.1 కోటి అయితే.. ప్రభుత్వం మీకు గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తుంది. పశుసంవర్ధక రంగాన్ని లాభదాయకమైన గ్రామీణ వ్యాపారంగా మార్చడం, దేశీయ జాతులను సంరక్షించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ఏమిటీ గాడిదల పెంపకం సబ్సిడీ పథకం?
ప్రభుత్వం ఇప్పుడు గాడిదల పెంపకాన్ని కేవలం ఓ సంప్రదాయ వృత్తిగా కాకుండా, ఒక వ్యవస్థీకృత అగ్రి-స్టార్టప్ మోడల్‌గా చూస్తోంది. ప్రాజెక్ట్ వ్యయంలో 50శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.ఈ సబ్సిడీ మొత్తం రెండు వాయిదాలలో అందుతుంది. మొదటి విడత బ్యాంక్ లోన్ మంజూరైన తర్వాత, రెండో విడత ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైన తర్వాత విడుదల చేస్తారు.దీని ద్వారా గ్రామీణ ఉపాధి, పశుసంపద అభివృద్ధి, దేశీయ పశువుల రక్షణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో సాయం చేస్తోంది?
2019 పశుగణన ప్రకారం.. దేశంలో గాడిదల సంఖ్య కేవలం 1.23 లక్షలకు పడిపోయింది. అంతరించిపోతున్న దేశీయ జాతులను కాపాడటంతో పాటు, పశువుల ఆధారిత ఉపాధిని పెంచడానికి ఈ అడుగు వేసింది. ప్రస్తుతం గాడిదలను కేవలం బరువులు మోయడానికే కాకుండా.. గాడిద పాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది (లీటరు వేల రూపాయలలో పలుకుతోంది). సేంద్రీయ ఎరువుల తయారీలో వినియోగించనున్నారు. ఇటుక బట్టీలు, కొండ ప్రాంతాలలో సరుకు రవాణాకు ఇప్పటికీ వీటి అవసరం ఉంది.
పథకం ప్రయోజనం పొందడానికి నిబంధనలు
ఈ సబ్సిడీ పొందడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. మీ ఫారమ్‌లో కనీసం 50 ఆడ గాడిదలు, 5 మగ గాడిదలు ఉండాలి. కేవలం దేశీయ రకానికి చెందిన గాడిదల పెంపకానికే సబ్సిడీ వర్తిస్తుంది. 2024 నుంచి గుర్రాలు, ఒంటెల పెంపకాన్ని కూడా ఈ పథకంలో చేర్చారు. వీటికి రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సాయం లభిస్తుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతిలో ఉంటుంది.
*ఆసక్తి గల వారు nlm.udyamimitra.in పోర్టల్‌ను సందర్శించాలి.
*అక్కడ 'Donkey Farming Subsidy' కోసం ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి.
*బ్యాంక్ నుంచి లోన్ అప్రూవల్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టవచ్చు.
*సరైన ప్లానింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌తో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, ఇది కేవలం లక్షల్లోనే కాదు, కోట్లలో లాభాలను తెచ్చిపెట్టే స్టార్టప్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
IND vs Eng: ఇంగ్లండ్ పై భారత్ కు ఎడ్జ్ వీరిద్దరే-గవాస్కర్ తాజా లెక్క..! -
India: ఇరాన్ దెబ్బకు బైబై ట్రంప్..! మళ్లీ పుతిన్ వైపు భారత్ చూపు? -
భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతోంది: పాక్ అధ్యక్షుడి సంచలనం! -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
రూ.50 లక్షలు వరకు సర్కారు ఆర్ధికసాయం.. మీకు కావాలా ?? -
"హోలీ" విషెస్ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే అకౌంట్లో డబ్బులు స్వాహానే ! -
ఆ పథకంలో రూ. 4లక్షలు రాయితీ.. రైతులకు భారీ శుభవార్త! -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్ -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే! -
నేడే చంద్ర గ్రహణం- తెరచి వుండే ఆలయాలు ఇవే












Click it and Unblock the Notifications