EPFO: 2009 నుంచి పని చేస్తున్న వారికి పీఎఫ్! అక్టోబర్ 31 వరకు గోల్డెన్ చాన్స్

ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వ్యాపార సంస్థల అధిపతులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ నానా రకాల కారణాల వల్ల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి రాని ఉద్యోగుల భాగ్యరేఖలు మారబోతున్నాయి. గతంలో పీఎఫ్ పరిధిలోకి రాని అర్హులైన ఉద్యోగులందరినీ సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకురావడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ "ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ ప్రచారం-2026"ను ప్రారంభించింది. ఈ అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అక్టోబర్ 31, 2026ని చివరి తేదీగా నిర్ణయించారు.

17 ఏళ్ల సడలింపు.. ఆ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్!

ఈపీఎఫ్‌ఓ ప్రకటించిన ఈ ప్రత్యేక పథకం ప్రకారం.. ఏప్రిల్ 1, 2009 నుంచి మార్చి 31, 2026 మధ్య కాలంలో ఉద్యోగంలో చేరి ఇప్పటివరకు పి.ఎఫ్ పరిధిలోకి రాని అర్హులైన ప్రతి ఒక్కరినీ ఇప్పుడు పీఎఫ్‌లో చేర్పించవచ్చు. సంస్థలు తమ పాత పొరపాట్లను సరిదిద్దుకుని, ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, ఫ్యామిలీ పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధమైన సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించడానికి ఈ సీనియర్ లెవల్ ప్రచారాన్ని వేదికగా మార్చింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆర్గానైజేషన్ పూర్తిగా డిజిటలైజ్ చేసింది. యజమానులు తమ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా "ఫేస్ అథెంటికేషన్" సదుపాయంతో కొత్త యూఎఎన్ జనరేట్ చేసి సులభంగా ఉద్యోగుల వివరాలను నవీకరించవచ్చు.

EPFO Special Campaign 2026 Eligible Employees Without EPF Can Now Get Enrolled Before October 31 Deadline

యాజమాన్యాలకు బంపర్ ఆఫర్.. ఉద్యోగి వాటా మినహాయింపు!

ఈ స్పెషల్ విండోలో కంపెనీల యజమానులకు ఊహించని వెసులుబాటు లభించింది. గతంలో ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ వాటా కట్ చేయకుండా ఉంటే.. ఆ ఉద్యోగి చెల్లించాల్సిన గత బకాయిలను ఆర్గానైజేషన్ పూర్తిగా మినహాయించింది (. అంటే యజమాని కేవలం తమ యాజమాన్య వాటాతో పాటు దానికి సంబంధించిన వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, రూ. 100 నామమాత్రపు పెనాల్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఉద్యోగి జేబు నుంచి ఒక్క రూపాయి కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, జీతం నుంచి కోత విధించి కూడా ఈపీఎఫ్‌ఓకి జమ చేయని యాజమాన్యాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

EPFO: అక్టోబర్ 31 వరకే ఛాన్స్, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్పెషల్ స్కీమ్!
EPFO: అక్టోబర్ 31 వరకే ఛాన్స్, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్పెషల్ స్కీమ్!

'విశ్వాస్' స్కీమ్‌తో పాత వివాదాలకు చెక్!

కేవలం ఉద్యోగుల ఎన్‌రోల్‌మెంట్ మాత్రమే కాకుండా, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పీఎఫ్ జరిమానాలు, వివాదాలను తక్కువ వ్యయంతో పరిష్కరించడానికి 'విశ్వాస్ 2026' (VISHWAS 2026) అనే వన్-టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను కూడా ఆర్గానైజేషన్ అందుబాటులోకి తెచ్చింది. పాత బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్న సంస్థలు EEC ద్వారా ఉద్యోగుల వివర నమోదు పూర్తి చేసి, ఆ తర్వాత 'విశ్వాస్' పథకం ద్వారా పెనాల్టీలపై బారీ మినహాయింపు పొందే అవకాశం లభిస్తుంది.

EPFO: జాబ్ మారుతున్నారా? కెరీర్ మార్పు వేళ ఈ తప్పు అస్సలు చేయకండి!
EPFO: జాబ్ మారుతున్నారా? కెరీర్ మార్పు వేళ ఈ తప్పు అస్సలు చేయకండి!

అక్టోబర్ 31లోగా సర్దుబాటు చేసుకోండి!

ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక ప్రచారం అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని ప్రైవేట్ సంస్థలు, వ్యాపార యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన పాత, కొత్త సిబ్బందికి పీఎఫ్ భద్రత కల్పించాలని ఈపీఎఫ్‌ఓ కోరుతోంది. అటు ఉద్యోగులకు ఆర్థిక భద్రత, ఇటు కంపెనీలకు చట్టపరమైన ఊరట లభించేలా రూపొందించిన ఈ పథకాన్ని ఆలస్యం చేయకుండా ఉపయోగించుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+