శుభవార్త: ఆపిల్ మొబైల్స్‌పై బంపర్ ఆఫర్స్, ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ వీక్‌ను ప్రారంభించింది. ఆపిల్ ఉత్పత్తులపై అతి తక్కువ ధరకే ప్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.8వేల క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.

ఈ కామర్స్ సంస్థల పోటీలతో వినియోగదారులకు తక్కువ ధరకే మొబైల్స్ తో పాటు పలు వస్తువులను అందిస్తున్నాయి. ఈ మేరకు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ కు పోటీగా అమెజాన్ కూడ గతంలో కొన్ని ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ రెండు సంస్థలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య పోటీతో వినియోగదారులకు ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆపిల్‌వీక్ ప్రారంభించిన ప్లిప్ కార్ట్

ఆపిల్‌వీక్ ప్రారంభించిన ప్లిప్ కార్ట్

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్‌ వీక్‌ను ప్రారంభించింది. ఈ వీక్‌లో భాగంగా ఆపిల్‌ ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, వాచ్‌లపై బెస్ట్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.

 ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు

ఆపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు

ఆపిల్ ఉత్పత్తులపై ప్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు ప్రకటించింది. ఆపిల్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ఒరిజినల్‌ ధర 89వేల రూపాయలు. అదేవిధంగా 256జీబీ వేరియంట్‌ ధర రూ.1,02,000. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలుదారులు 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాక రూ.18వేల వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది

ఐపోన్ 8పై తగ్గింపు ధరలు

ఐపోన్ 8పై తగ్గింపు ధరలు

ఐఫోన్ 8పై కూడ ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరలను ప్రకటించింది.ఐఫోన్‌ 8(64జీబీ) ను 54,999 రూపాయలకు విక్రయించనుంది. వాస్తవానికి దీని ధర రూ.64వేలు.ఈ స్మార్ట్‌పోన్‌పై సుమారు 9వేల రూపాయాలను ప్లిప్‌కార్ట్ ప్రకటించింది.ఐఫోన్‌ 8 ప్లస్‌(64జీబీ) ను 66,499 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. దీని వాస్తవ ధర 73వేలు.

ఐఫోన్ 7పై డిస్కౌంట్లు

ఐఫోన్ 7పై డిస్కౌంట్లు

ఐఫోన్‌ 7 ప్లస్‌(32జీబీ) స్మార్ట్‌ఫోన్‌ ధరను ఫ్లిప్‌కార్ట్‌ 56,999 రూపాయలకు ప్లిప్ కార్ట్ అందించనుంది. దీని వాస్తవ దర రూ.59వేలు. ఐఫోన్‌ 7 ధర కూడా 49వేల రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గించింది.ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఈఎంఐ లావాదేవీలపై 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Flipkart is hosting an Apple Week till January 15 and it will offer discounts and cashback on iPhones, iPads, MacBooks, Apple Watch. Flipkart is also offering cashback to ICICI Bank credit card holders who do an EMI transaction.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి