పసిడి రేట్లను దెబ్బకొడుతున్న కీ ఫ్యాక్టర్స్.. ఆశలన్నీ!!

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో క్రమంగా మార్పులు కనిపిస్తోన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో శుక్రవారం పసిడి, వెండి ధరలు స్వల్పంగా లాభాల్లో పయనించినప్పటికీ.. క్లోజింగ్ సెషన్ సమయానికి రెడ్ ఫ్లాగ్ రికార్డయింది. తగ్గుదల బాట పట్టింది. పండగ సీజన్ సమీపించిన తరుణంలో మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఈ ధోరణులు అటు సామాన్య కొనుగోలుదారులు, ఇటు దీర్ఘకాలిక మదుపరులలో గందరగోళానికి గురి చేస్తోన్నాయి.

శుక్రవారం ఎంసీఎక్స్ లో అక్టోబర్ 5 తేదీ నాటి పసిడి ఫ్యూచర్స్ ధర 0.16 శాతం మేర పుంజుకుంది. 10 గ్రాములకు రూ.1,50,949 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ 4 నాటి గడువుతో ఉన్న వెండి ఫ్యూచర్స్ కూడా సానుకూల ధోరణిని ప్రదర్శిస్తూ 0.18 శాతం లాభాన్ని నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.2,33,891 మార్క్ వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 160, 22 క్యారెట్లల్లో రూ. 150, 18 క్యారెట్లల్లో రూ. 120 మేర పెరుగుదల నమోదైంది గానీ.. అంతే పరిమాణంలో తగ్గింది కూడా.

Gold and Silver prices depend on the Global economy investors sentiment and real demand factors

రిటైల్ మార్కెట్ లో తాజా లెక్కల ప్రకారం 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,51,450 వద్ద నమోదు కాగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,38,728 గా రికార్డయింది. వెండి ధర రూ. 2,31,985 వద్ద స్థిరపడింది. పసిడి, వెండి ధరల గమనాన్ని నిర్దేశించడంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి కొనుగోళ్లన్నీ కూడా డాలర్ల రూపంలో జరుగుతాయి.

బంగారం ధరల్లో పురోగమనం- కొనుగోళ్లకు భారీగా ఊపు
బంగారం ధరల్లో పురోగమనం- కొనుగోళ్లకు భారీగా ఊపు

డాలర్ బలహీనపడిన ప్రతిసారీ ఇతర కరెన్సీలు కలిగిన దేశాల వినియోగదారులకు బంగారం చౌకగా మారి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అదే సమయంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల విధానాలు కూడా పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ధరల పెరుగుదలకు ప్రధాన ఇంధనంగా మారుతుంటాయి. మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు తమ సంపద విలువ తగ్గకుండా చూసుకోవడానికి మదుపరులు బంగారాన్ని సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొనే యుద్ధ భయాలు, భౌగోళిక రాజకీయ ఘర్షణలు లేదా ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పుడు కూడా మార్కెట్లో అనిశ్చితి పెరిగి బంగారంపై పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వెండికి పారిశ్రామిక అవసరాలు కూడా ఎక్కువగా ఉండడం దీనికి అదనపు బలాన్నిస్తుంది. పండగల సమయాల్లో ఆభరణాల తయారీదారుల నుండి వచ్చే ఆర్డర్లు, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు జరిపే నిల్వల సమీకరణ ఈ ధరలలో మార్పు తీసుకువస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+