బంగారం, వెండి ధరల్లో బిగ్ టర్న్! ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
గత కొంత రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న పసిడి రేట్లు ఇటీవల కొంత మేర వెనక్కి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, పెరిగిన ఇంధన ధరల కారణంగా దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రభావం పడింది. గత ఏడాది కాలంతో పోలిస్తే మాత్రం బంగారం ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగినప్పటికీ, గత నెల రోజుల కాలంతో చూస్తే మాత్రం పసిడి ధరలు సుమారు 7 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం. వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయంటే..
ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,39,950 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,510 గా ఉంది.
హైదరాబాద్ నగరంలో గ్రాము 24 క్యారెట్ల ధర రూ. 15,268 గాను, 22 క్యారెట్లు గ్రాము రూ. 13,995 గాను, 18 క్యారెట్ల గ్రాము రూ. 11,451 గాను ఉంది.

- ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,810 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,159గా ఉంది.
- దిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,550 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,921 వద్ద లభిస్తోంది.
- చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000గా ఉంది.
- కోల్కతా: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,950 వద్ద ఉంది.
- బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,950 గా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరల తీరు (కిలోకు):
- హైదరాబాద్: కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద విక్రయమవుతోంది.
- ముంబై: కిలో వెండి ధర రూ.2,45,000 గా ఉంది.
- దిల్లీ: కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.
- చెన్నై: కిలో వెండి ధర రూ.2,50,000గా నమోదైంది.
- కోల్కతా: కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ఉంది.
- బెంగళూరు: కిలో వెండి ధర రూ.2,45,000 గా ఉంది.
ఇక్కడ అందించిన బంగారం, వెండి ధరలు కేవలం సూచిక మాత్రమేనని గమనించాలి. ప్రాంతాన్ని బట్టి, అలాగే ఆయా నగల దుకాణాలను బట్టి ధరల్లో చిన్నపాటి తేడాలు ఉండవచ్చు. అంతేకాకుండా, ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జ్యూవెలర్స్ చెప్పే ధరకు అదనంగా మేకింగ్ చార్జీలు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications
