Gold Price Today: బంగారం ధర నేడు పడిపోయిందా? స్థిరంగా ఉందా? కిలో వెండి ధర ఎంత?

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికాల నడుమ పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు బంగారం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత కొంతకాలంగా పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారులు అయోమయంలో పడ్డారు. ఇటీవల వరకు భారీగా పడిపోయిన పసిడి ధరలు.. గురువారం నాటికి కొంతవరకు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి మార్కెట్ ఊరటనిచ్చే అంశంగా మారింది.

నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!

దేశీయ మార్కెట్‌లో గురువారం నాటి ధరల గణాంకాలను పరిశీలిస్తే.. 24 క్యారట్ల మేలిమి బంగారం గ్రాము ధర రూ.14,957 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల ఆభరణాల బంగారం గ్రాము రూ.13,710 వద్ద, అలాగే 18 క్యారట్ల బంగారం గ్రాము రూ.11,218 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.14,95,700 గాను, 22 క్యారట్ల బంగారం 100 గ్రాములు రూ.13,71,000 గానూ నమోదు అయ్యాయి. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

Gold and Silver Rates Today Check Latest Prices in Hyderabad Vijayawada Delhi Mumbai and Chennai
బంగారం ధరల్లో బిగ్ ఫాల్: రెండో రోజూ: పసిడి కళకళ
బంగారం ధరల్లో బిగ్ ఫాల్: రెండో రోజూ: పసిడి కళకళ

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిలో నమోదయ్యాయి. ఈ మూడూ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,49,570 వద్ద నిలిచింది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,100 గానూ, 18 క్యారట్ల బంగారం ధర రూ.1,11,180 గానూ వ్యాపారం సాగుతోంది.

పసిడి ప్రియులకు ధమాకా- గోల్డ్ రేట్ డౌన్
పసిడి ప్రియులకు ధమాకా- గోల్డ్ రేట్ డౌన్

ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో పరిస్థితి

దేశంలోని మిగతా నగరాల్లో చూస్తే.. బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ.1,49,570 గా నమోదవగా, 22 క్యారట్ల ధర రూ.1,37,100 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ.1,49,700 గానూ, 22 క్యారట్ల ధర రూ.1,37,250 గానూ పలికింది. చెన్నైలో 24 క్యారట్ల ధర రూ.1,49,570 గా ఉండగా, అహ్మదాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.1,49,600 వద్ద ట్రేడింగ్ అవుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు చల్లారితే తప్ప పసిడి ధరల పతనం లేదా పెరుగుదలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+