స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్, షెడ్యూల్..!!

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఫిక్స్ అయింది. సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడిన వెంటనే షెడ్యూల్ ప్రకటించేలా ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల పైన అంచనాలు సిద్దం అయినట్లు తెలుస్తోంది. అటు రాజకీయం గానూ కూటమి- వైసీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. స్థానిక ఎన్నికల పైన మంత్రుల కు సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. దీంతో.. రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కానుంది.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన దిశగా కసరత్తు కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 9న లేదా 12వ తేదీన నోటిఫికేషన్‌ రావడం ఖాయమన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ఐక్యతకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉందన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబరు నెలాఖరుకు ముగుస్తుందని తెలిపారు. దీంతో.. నవంబర్ ద్వితీయార్ధంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రేపు (శుక్రవారం) సుప్రీం కోర్టు లో బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తిరుపతిలోనే భక్తుల వాహనాల పార్కింగ్ - క్యూ ఆర్ కోడ్ తో లొకేషన్..!!
తిరుపతిలోనే భక్తుల వాహనాల పార్కింగ్ - క్యూ ఆర్ కోడ్ తో లొకేషన్..!!
ap-local-body-elections-supreme-court-verdict-on-bc-reservations-notification-on-october-9-or-12

సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన తరువాత

కాగా, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల పైన పూర్తి సమాయత్తం అవుతోంది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈరోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోఅన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కమిషన్ అధికారులతో విస్తృతంగా చర్చించనుంది. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైన సూచనలు చేయనున్నారు. దీంతో.. ఎన్నికల పైన రేపు పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+