బంగారం రేట్లు.. కరవు తీరా
దేశంలో బంగారం, వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. పశ్చిమ ఆసియాలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయనే ఆశలు ప్రధాన కారణం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వైఖరి, ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యలు ఉండవని ప్రకటించడంతో ఈ ఆశావాదం మరింత బలపడింది. దీంతో డాలర్ ఇండెక్స్ మూడు రోజుల పురోగతికి తెరపడింది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు కూడా తగ్గాయి.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 100 డాలర్లకు పడిపోగా.. బ్రెంట్ ఫ్యూచర్స్ 108 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,310గా, 22 క్యారెట్లు రూ. 1,38,700గా నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు 1.39 శాతం పెరిగాయి. రూ. 1,51,832కి చేరాయి. వెండి ధర కిలోకు రూ. 2,50,915 ట్రేడ్ అవుతోంది.

ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్ల పసిడి రూ. 1,38,850, 24 క్యారెట్ల పసిడి రూ. 1,51,460గా నమోదైంది. అహ్మదాబాద్, పూణేలలో వరుసగా 22 క్యారెట్లు, 24 క్యారెట్లు రూ. 1,38,750, రూ. 1,51,360గా ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,700, 24 క్యారెట్లు రూ. 1,51,310 వద్ద లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,632.39 డాలర్లకు చేరింది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,328, 22 క్యారెట్లు - రూ. 14,050, 18 క్యారెట్లు - రూ. 11,270
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,131, 22 క్యారెట్లు- రూ. 13,870, 18 క్యారెట్లు - రూ. 11,348
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,131, 22 క్యారెట్లు- రూ. 13,870, 18 క్యారెట్లు - రూ. 11,348
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,131, 22 క్యారెట్లు- రూ. 13,870, 18 క్యారెట్లు - రూ. 11,348
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,131, 22 క్యారెట్లు- రూ. 13,870, 18 క్యారెట్లు - రూ. 11,348
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,131, 22 క్యారెట్లు- రూ. 13,870, 18 క్యారెట్లు - రూ. 11,348

Click it and Unblock the Notifications