Gold Price Today: పసిడి ప్రియులకు పండగే పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం!
గత నాలుగు రోజులుగా బంగారం తగ్గుతున్నాయి. ఇది నిజంగా పసిడి ప్రియులకు శుభవార్తే. దేశీయ మార్కెట్‌లో గోల్డ్, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొన్ని రోజులుగా జెడ్ స్పీడ్‌తో పెరుగుతూ వస్తున్న ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో వినియోగదారులు కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో ధరలు తగ్గడం మరింత కలిసి వచ్చింది.
రెండు రోజుల్లో భారీగా పసిడి ధరలు పతనం.
ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, గోవా, ముంబై వంటి నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.8,929 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 8,185 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 89,290 లకు దిగిరాగా.. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 81,850 లకు చేరింది. నిన్న, ఈ రోజు 24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు దాదాపు 490, 22 క్యారెట్ల రూ. 450 మేరకు తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశంలో ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,929, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,185. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,929, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,185 గా ఉంది. బెంగళూరు ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,929, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,185. చెన్నై ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,929, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,185 . న్యూఢిల్లీ లో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ 8,944, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ. 8,200 . గోవాలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,929, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 8,185 . సూరత్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం గ్రాము కు రూ. 8,934, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 8,190 . ముంబయి ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 8,929, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.8,185 లకు చేరింది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. సోమవారం కిలో వెండి ధర రూ. 1,00,480 ఉండగా, మంగళవారం నాటికి రూ. 270 తగ్గి రూ. 1,00,210కు చేరుకుంది. వెండి ధరలు కూడా తగ్గడంతో వెండి ఆభరణాలు, వస్తువులు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు.
ధరలు తగ్గడానికి కారణం ఏమిటి?
బంగారం, వెండి ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, కరెన్సీ హెచ్చుతగ్గులు, వివిధ దేశాల ఆర్థిక విధానాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
ఇప్పుడు కొనడం మంచిదా? లేక వేచి చూడాలా?
ధరలు తగ్గిన నేపథ్యంలో బంగారం, వెండి కొనడానికి ఇదే సరైన సమయమా? లేక ధరలు మరింత తగ్గుతాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే, బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ధరలు మరింత తగ్గే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాలు ఉన్నవారు, అలాగే పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునే వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ధరలు మళ్లీ పెరిగేలోపు కొనుగోలు చేయడం మంచిది.












Click it and Unblock the Notifications