Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. సామాన్యులకు కాస్త ఊరట!

బంగారం... ఇది కేవలం ఒక లోహం కాదు, ఇది భారతీయుల జీవితాల్లో ఒక భాగం. పెట్టుబడికి నమ్మకమైన మార్గంగా, శుభకార్యాలకు చిహ్నంగా, మహిళలకు అలంకారంగా బంగారం ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే బంగారం ధరల్లో వచ్చే మార్పులు సామాన్యుడి నుండి వ్యాపారవేత్త వరకు అందరినీ ఆసక్తిగా గమనింపజేస్తాయి.

తగ్గిన బంగారం ధరలు..
ఇవాళ, బంగారం ధరలు నిన్నటితో పోల్చితే కాస్త తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీయంగా కూడా ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ 330 మేరకు తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹8,716, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹7,990 గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం సుమారు రూ. 30 తగ్గింది. ముంబైలో క్యారెట్‌ 10 గ్రాముల ధర 71,820 కాగా 24 క్యారెట్ల బంగారం రేటు రూ 76,500 చేరింది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ ధర రూ. 71,790, అటు 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 76,570, హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 71,240 కాగా 24 క్యారెట్ రూ 75,880గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ రూ. 71,270 , 24 క్యారెట్‌ గోల్డ్ రూ. 75,960, విజయవాడలో 69 680, 24 క్యారెట్ గోల్డ్ 75900, విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ 69,930 కాగా 24 క్యారెట్‌ బంగారం 76,010 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 1,08,100 గా నమోదు అయింది.

Gold Prices have come down some relief to the common man

MCX గోల్డ్ ఫ్యూచర్స్..
అటు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, MCXలో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర ₹294 తగ్గి ₹85,740 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు రోజు ముగింపు ధర ₹86,034 కాగా, నేడు ప్రారంభ ధర ₹85,740 వద్ద నమోదైంది. అంటే 0.34% మేర ధరలు తగ్గాయన్నమాట.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ఫ్యూచర్స్ ధర ₹332 తగ్గి ₹97,809 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి ముగింపు ధర ₹98,141 కాగా, నేడు ప్రారంభ ధర ₹97,956 వద్ద ఉంది. వెండి ధరలు కూడా 0.34% శాతం మేర తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో కారణాలు:
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వారపు లాభాల దిశగా కొనసాగుతున్నాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ విధానాలపై నెలకొన్న అనిశ్చితి. ఈ అనిశ్చితి కారణంగా మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.

గమనిక: ఈ సమాచారం ఈ రోజు అంచనాల ఆధారంగా రూపొందించబడింది. వాస్తవ ధరలు మారే అవకాశం ఉంది. పాఠకులు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+