సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు ఉందా? 8% వరకు వడ్డీ పొందే సీక్రెట్ ట్రిక్!

సాధారణంగా మనం ప్రతిరోజూ ఉపయోగించే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే డబ్బుపై బ్యాంకులు చాలా తక్కువ వడ్డీని మాత్రమే అందిస్తాయి. చాలా బ్యాంకులు కేవలం 2.5శాతం వరకు మాత్రమే వడ్డీ ఇస్తాయి. మనం అత్యవసర అవసరాల కోసం లేదా నెలవారీ ఖర్చుల కోసం సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును నిల్వ ఉంచినప్పుడు అంత తక్కువ వడ్డీ రావడం వల్ల మన సొమ్ము పెద్దగా పెరగదు. ఆర్థికంగా ఆలోచిస్తే సేవింగ్స్ ఖాతాలో ఉన్న అదనపు నిధులపై తగినంత రాబడి రాకపోవడం ఓ విధంగా నష్టమే అని చెప్పవచ్చు.

రోజుకు 3 సార్లు నగ్నంగా నిలబెట్టేవారు.. తీహార్ జైలు అనుభవాలపై నటి ఆవేదన!
రోజుకు 3 సార్లు నగ్నంగా నిలబెట్టేవారు.. తీహార్ జైలు అనుభవాలపై నటి ఆవేదన!

ఆటో స్వీప్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?
ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాంకులు 'ఆటో స్వీప్ ఫిక్స్‌డ్ డిపాజిట్' అనే ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఈ ఆప్షన్‌ను మీ సేవింగ్స్ ఖాతాకు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా సేవింగ్స్ అకౌంట్లోని డబ్బుపైనే 6 శాతం నుంచి 8 శాతం వరకు అధిక వడ్డీని పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోని దాదాపు 80 శాతం ప్రధాన బ్యాంకులు ఈ ఆటో స్వీప్ సదుపాయాన్ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల సాధారణ సేవింగ్స్ అకౌంట్ లభ్యత, ఫిక్స్‌డ్ డిపాజిట్ అధిక రాబడి రెండూ ఒకే ఖాతాలో లభిస్తాయి.

how to activate Auto Sweep Fixed Deposit E arn Up to 8PC Interest on Savings Account with this Trick

థ్రెషోల్డ్ లిమిట్, లెక్కించే విధానం
ఆటో స్వీప్ విధానంలో ప్రతి బ్యాంక్ ఓ నిర్ణీత పరిమితిని నిర్దేశిస్తుంది. ఉదాహరణకు మీ బ్యాంక్ పరిమితిని రూ.25,000గా నిర్ణయించిందనుకుందాం. ఇప్పుడు మీ ఖాతాలో రూ.లక్ష జమ చేస్తే.. అందులోని మొదటి రూ.25,000పై సాధారణ సేవింగ్స్ ఖాతాకు వడ్డీ(2.5 శాతం) వర్తిస్తుంది. పరిమితికి మించి ఉన్న అదనపు రూ.75,000 ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలోకి మారిపోతుంది. ఈ రూ.75 వేలకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వర్తించే 6 శాతం నుంచి 8 శాతం వరకు అధిక వడ్డీ లభిస్తుంది.

మనీ విత్‌డ్రా ఎలా?
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లను వ్యవధి ముగియకుండా బ్రేక్ చేస్తే బ్యాంకులు పెనాల్టీలు విధిస్తాయి. కానీ ఆటో స్వీప్ విధానంలో ముందస్తు ఉపసంహరణకు ఎలాంటి పెనాల్టీలు ఉండవు. ఉదాహరణకు మీ ఖాతా నుంచి మీరు రూ.50,000 వేరొకరికి చెల్లించాల్సి వచ్చినప్పుడు మొదట సేవింగ్స్ అకౌంట్ పరిమితిలో ఉన్న రూ.25 వేలు ఉపయోగించబడుతుంది. మిగిలిన రూ.25 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉన్న సొమ్ము నుంచి ఆటోమేటిక్‌గా మళ్లించబడుతుంది. ఈ ప్రక్రియ ముగిసాక ఎఫ్‌డీలో మిగిలిన రూ.50 వేలపై యథావిధిగా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ కొనసాగుతుంది.

Mandaadi First Review: సముద్రంలో స్పోర్ట్స్ యాక్షన్ మెప్పించిందా..?
Mandaadi First Review: సముద్రంలో స్పోర్ట్స్ యాక్షన్ మెప్పించిందా..?

మళ్లీ ఎప్పుడైనా మీ ఖాతాలోకి కొత్తగా డబ్బు జమ అయినప్పుడు థ్రెషోల్డ్ లిమిట్ రూ.25,000 దాటి సొమ్ము తిరిగి ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీ‌గా మారిపోతుంది. మీ వైపు నుంచి ఎలాంటి ప్రత్యేక అప్లికేషన్ లేదా ప్రతిసారీ ఎఫ్‌డీ చేయాల్సిన అవసరం లేకుండానే బ్యాంక్ సిస్టమ్ దీనిని నిర్వహిస్తుంది. సేవింగ్స్ ఖాతాలో ఎల్లప్పుడూ కొంత మొత్తం నిల్వ ఉంచే వారికి, వ్యాపారులకు ఈ ఆటో స్వీప్ ఫీచర్ ఆర్థికంగా ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+