వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన టీసీఎస్ షేర్ విలువ:ఇన్వెస్టర్ల లాభాలు రూ. 30వేల కోట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్ శుక్రవారం నాడు 6 శాతానికి పైగా పుంజుకొంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడానికి టీసీఎస్ సిద్దంగా ఉంది. 2017-18 ఏడాది 4వ క్వార్టర్‌ ఫలితాల్లో అంచనాలను మించి రాణించడంతో వాటాదారులకు 1:1 బోనస్ బొనాంజాతో నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 30 వేల కోట్లకు పుంజుకొంది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ను సాధించిన దిగ్గజ సంస్థగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన టీసీఎస్ తాజాగా ఈ సరికొత్త రికార్డును సాధించింది. టీసీఎస్‌ షేర్‌ రూ. 3400 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది..

In Minutes, TCS Makes Investors Richer By Rs. 30,000 Crore

ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్‌ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీ టీసీఎస్‌. అంతేకాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో (38 బిలియన్‌ డాలర్లు) పోలిస్తే ఇది రెండున్నరెట్లు ఎక్కువ.

కాగా క్యూ4(జనవరి-మార్చి)లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి రూ. 6904 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.

English summary
Shares of Tata Consultancy Services Ltd (TCS) surged over 5 per cent after India's top software services exporter posted better-than-expected earnings in the March quarter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X