వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంచాలి: ఎస్ బి ఐ నివేదిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమర్పణకు ముందే ఎస్‌బిఐ నివేదికను వెల్లడించింది. ఆదాయ పన్ను మినహయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని ఎస్ బి ఐ తన నివేదికలో అభిప్రాయపడింది. దీని ద్వారా సుమారు 75 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఎస్ బి ఐ తన నివేదికలో అభిప్రాయపడింది.

కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. 2018 బడ్జెట్ రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో బడ్జెట్‌ రూపకల్పనపై పలువురు ఆశలు పెట్టుకొన్నారు.

2018 బడ్జెట్‌లో ఏ రకమైన మినహయింపులను ప్రభుత్వం కల్పించనుందనే విషయమై చర్చ సాగుతోంది. ఈ తరుణంలోనే ఎస్ బి ఐ ఇచ్చిన నివేదిక మధ్య తరగతి ప్రజల్లో కొంత ఆశలను నింపుతోంది.

ఆదాయపు పన్నును రూ. 3 లక్షలకు పెంచాలని ఎస్ బి ఐ నివేదిక

ఆదాయపు పన్నును రూ. 3 లక్షలకు పెంచాలని ఎస్ బి ఐ నివేదిక

ఎస్ బి ఐ సోమవారం నాడు ఓ నివేదికను విడుదల చేసింది. ఆదాయపు పన్ను పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని ఈ నివేదికలో ఎస్ బి ఐ అభిప్రాయపడింది. దీని ద్వారా సుమారు 75 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆ నివేదికలో అభిప్రాయపడింది.దీని ద్వారా ప్రభుత్వంపై సుమారు రూ. 7500 కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది.

గృహ నిర్మాణంపై వడ్డీ చెల్లింపు పెంచాలన్న ఎస్ బి ఐ

గృహ నిర్మాణంపై వడ్డీ చెల్లింపు పెంచాలన్న ఎస్ బి ఐ

గృహ నిర్మాణంపై చెల్లించే వడ్డీకి సంబంధించిన మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరింది.దీంతో హోంలోన్‌ గ్రహీతలు సుమారు 75 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించింది.

సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ మూడేళ్ళకు కుదించాలి

సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ మూడేళ్ళకు కుదించాలి

సేవింగ్స్‌ టర్మ్‌ డిపాజిట్ల కాలపరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని సూచించింది. ఈ డిపాజిట్లను మినహాయింపు లభించే ఇఇఇ పన్ను విధానంలోకి తీసుకురాలని ఎస్ బి ఐ ఈ నివేదికలో కోరింది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ, మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల్లో గృహ సదుపాయ కల్పనకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించింది

సేవింగ్స్ డిపాజిట్ల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి

సేవింగ్స్ డిపాజిట్ల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి

బ్యాంకుల్లో సేవింగ్స్‌ డిపాజిట్లు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ బి ఐ తన నివేదికలో సూచించింది. మౌలిక సదుపాయాలకు మద్దతు అందించడం, కార్మికుల నైపుణ్య శిక్షణ లాంటి ఇతర చర్యలు తీసుకోవాలనిఎస్‌బిఐ తన నివేదికలో కోరింది.

English summary
With rise in personal disposable income post 7th Pay Commission, the income tax exemption limit needs to be raised by Rs 50,000 to Rs 3 lakh, a SBI report said today. The move will benefit around 75 lakh people, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X