TAX ఫారమ్‌లకు కొత్త నంబర్లు. ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్ వచ్చింది. దశాబ్దాలుగా పరిచయమైన ఫారమ్ 16, ఫారమ్ 26AS వంటి నంబర్లు త్వరలో మారబోతున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025, డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్-2026 ప్రకారం ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మొదట్లో కొంత గందరగోళం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఫారమ్‌ల ఉద్దేశం, పనితీరులో పెద్ద మార్పులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 నాటి పాత చట్టాన్ని రద్దు చేసి, ఆధునిక అవసరాలకు అనుగుణంగా సరళీకరించిన కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఫారమ్ నంబర్లను కూడా పునర్సంఖ్యీకరించారు. డ్రాఫ్ట్ నియమాలు 2026లో ఈ మార్పులను నోటిఫై చేశారు.

TAX ఫారమ్ మార్పులు
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన ఫారమ్‌ల నంబర్లు ఇలా మారనున్నాయి:
- ఫారమ్ 16 → ఫారమ్ 130: జీతగాళ్లకు ఇచ్చే టీడీఎస్ సర్టిఫికేట్ ఇకపై ఫారమ్ 130గా పిలుస్తారు.
- ఫారమ్ 26AS → ఫారమ్ 168: పన్ను చెల్లింపుల పూర్తి వివరాలు కలిగిన వార్షిక సమాచారం స్టేట్‌మెంట్ ఇప్పుడు ఫారమ్ 168గా మారుతుంది.
- ఫారమ్ 16A → ఫారమ్ 131: వడ్డీ వంటి జీతమేతర ఆదాయాలపై టీడీఎస్ సర్టిఫికేట్ ఫారమ్ 131గా ఉంటుంది.
- ఫారమ్ 24Q → ఫారమ్ 138: జీతాలపై త్రైమాసిక టీడీఎస్ నివేదిక ఫారమ్ 138గా మారుతుంది.
- ఫారమ్ 26Q → ఫారమ్ 140: జీతం కాకుండా ఇతర చెల్లింపులపై త్రైమాసిక నివేదిక ఫారమ్ 140గా ఉంటుంది.
- ఫారమ్ 27Q → ఫారమ్ 144: నివాసేతరులకు చేసిన చెల్లింపుల నివేదిక ఫారమ్ 144గా సూచించబడుతుంది.
- ఆడిట్ రిపోర్టులు (3CA, 3CB, 3CD) → ఫారమ్ 263C: వ్యాపారవేత్తల ఆడిట్ నివేదికలు ఇకపై ఒకే ఫారమ్ 263C కింద వస్తాయి.
ఈ మార్పులు పన్ను చట్టాన్ని కొత్త నిర్మాణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడమే లక్ష్యంగా తీసుకున్న శాసనపరమైన చర్యలుగా భావిస్తున్నారు.
అమలు ఎలా ఉంటుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మార్పుల అమలు ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు, యుటిలిటీలు, అలాగే ఆదాయపు పన్ను పోర్టల్ సిస్టమ్ సిద్ధతపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ దశలో సిస్టమ్ ఆధారిత సూచనలు, FAQs, స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటే గందరగోళం తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్ నియమాలు ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫారమ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ప్రారంభంలో అయోమయం ఉండొచ్చు, కానీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వివరణాత్మక మార్గదర్శకాలతో ఈ మార్పులు క్రమంగా అందరికీ అలవాటు అవుతాయని ప్రభుత్వం, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, ఫారమ్ నంబర్లు మారినా - పన్ను చెల్లింపుదారుల బాధ్యతలు, ప్రక్రియల ప్రాథమిక ఉద్దేశ్యం మాత్రం పెద్దగా మారడం లేదు. కాబట్టి ముందుగానే ఈ మార్పులపై అవగాహన పెంచుకోవడం మంచిది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications