Indigo Airlines:దేశీయ ముద్దుబిడ్డ నుండి ప్రపంచ దిగ్గజం వరకు!

విమానయాన రంగంలో దూసుకుపోతున్న భారతీయ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సీట్ల సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే రెండవ అత్యంత వేగంగా ఎదుగుతున్న విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. 2024 సంవత్సరంలో ఇండిగో సీట్ల సామర్థ్యం ఏకంగా 10.1 శాతం పెరిగి 134.9 మిలియన్ లకు చేరుకుంది. అధికారిక ఎయిర్‌లైన్ గైడ్ (OAG) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఇండిగో ఈ ఘనత సాధించి ప్రపంచ విమానయాన రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

తొలి స్థానంలో ఖతార్ ఎయిర్‌వేస్
ఈ విషయంలో ఖతార్ ఎయిర్‌వేస్ మాత్రమే ఇండిగో కంటే ముందుంది. ఖతార్ ఎయిర్‌వేస్ సీట్ల సామర్థ్యం 10.4 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, విమానాల ఫ్రీక్వెన్సీ వృద్ధి పరంగా ఇండిగో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2024లో ఇండిగో విమానాల ఫ్రీక్వెన్సీ 9.7 శాతం పెరిగి 749,156కు చేరుకుంది. అంటే, ఇండిగో విమానాలు నిరంతరం ఆకాశంలో చక్కర్లు కొడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి.

Indias IndiGo becomes the worlds second fastest wing deets here

ఇండిగో సాధిస్తున్న ఈ విజయాలకు కారణం సంస్థ యొక్క వ్యూహాత్మక ప్రణాళికలు అవిశ్రాంత కృషి అని చెప్పొచ్చు. OAG నివేదిక ప్రకారం, ఇండిగో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల ఆర్డర్‌లలో ఒకటి కలిగి ఉంది. దాదాపు 900 విమానాల ఆర్డర్‌తో ఇండిగో తన విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. అంతేకాకుండా, 2024లో అత్యధికంగా 58 కొత్త ఎయిర్‌బస్ విమానాలను అందుకున్న సంస్థగా కూడా ఇండిగో గుర్తింపు పొందింది. కొత్త విమానాల రాకతో ఇండిగో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడానికి మరియు ప్రయాణికులకు మరిన్ని గమ్యస్థానాలకు చేరువ చేయడానికి సిద్ధంగా ఉంది.అయితే, అన్ని విజయాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సప్లయ్ చైన్ సమస్యల కారణంగా దాదాపు 80 విమానాలు నిర్వహణ మరియు మరమ్మత్తు (MRO) సంబంధిత కారణాల వల్ల నిరుపయోగంగా ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఇండిగో చర్యలు తీసుకుంటోంది.

అంతర్జాతీయంగా విస్తరించిన ఇండిగో
ప్రస్తుతం ఇండిగో తన సామర్థ్యంలో 88 శాతం దేశీయ మార్కెట్‌కు కేటాయిస్తోంది.అయినప్పటికీ,అంతర్జాతీయ వృద్ధిపై కూడా సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. 2024లో ప్రాంతీయ మధ్యప్రాచ్య మార్కెట్లు మరియు థాయ్‌లాండ్‌పై దృష్టి సారించి అంతర్జాతీయంగా విస్తరించింది. భవిష్యత్తులో లాంగ్-హాల్ తక్కువ-ధర సేవలను అభివృద్ధి చేయాలనేది ఇండిగో యొక్క ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా, 2025 నాటికి వెట్ లీజ్ విమానాలను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విమానాయాన రంగంలో ఇండిగో మార్క్
ఇక ఆర్థిక పరంగా చూస్తే,ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపుకు ముందుగా అంటే మార్చి 31, 2025తో ముగిసిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇండిగో రూ.2,449 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే,ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం తక్కువ.కానీ,కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 14 శాతం పెరిగి రూ.22,111కోట్లకు చేరుకుంది.

మొత్తం ఆదాయం కూడా 14.6 శాతం పెరిగి రూ. 22,992.8 కోట్లుగా నమోదైంది.అదే సమయంలో,మొత్తం వ్యయాలు 19.9 శాతం పెరిగి రూ. 20,465.7 కోట్లకు చేరుకున్నాయి.ఈ త్రైమాసికంలో వడ్డీ, పన్నులు, తరుగుదల ఇంకా రుణ విమోచన ముందు ఆదాయాలు (EBITDA) 0.7 శాతం స్వల్పంగా పెరిగి రూ. 5,178.6 కోట్లకు చేరుకుంది. లోడ్ ఫ్యాక్టర్ 86.9 శాతంగా ఉంది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 85.8 శాతంగా ఉంది.లోడ్ ఫ్యాక్టర్ పెరగడం అంటే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడం . ఇది సంస్థ యొక్క సమర్థవంతమైన నిర్వహణకు నిదర్శనం.

మొత్తం మీద, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రపంచ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. వేగవంతమైన వృద్ధి, భారీ విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలు ,సమర్థవంతమైన నిర్వహణ ఇండిగోను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే, ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ, నిరంతరం అభివృద్ధి చెందుతూ, ఇండిగో మరిన్ని విజయాలు సాధిస్తుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయ విమానయాన రంగం గర్వించదగిన సంస్థగా ఇండిగో ఎల్లప్పుడూ ముందుంచేందుకు తమ ప్రయత్నం కొనసాగుతుందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+