Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రచారార్భాటం లేకుండా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం

జాగ్వార్ ల్యాండ్ రోవర్.. తమిళనాడులో భారీ తయారీ ప్లాంట్ ను నెలకొల్పంది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో టాటా మోటార్స్ దీన్ని స్థాపించింది. ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఇక్కడే తయారవుతాయి. రాణిపేట సమీపంలోని పణపాక్కం సిప్కాట్ లో ఏర్పాటైన ఈ తయారీ కేంద్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పారిశ్రామిక, పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి టీఆర్బీ రాజా, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి సువర్ణ దినంగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై టాటా చూపిన నమ్మకానికి గర్వపడుతున్నానని, రాణిపేట్ జిల్లాలో 9,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టినందుకు ఆ సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. స్టీల్, ఐటీ, ఆటోమొబైల్స్ వంటి అనేక రంగాలలో టాటా దేశంలో కీలక పాత్ర పోషిస్తోందని, దేశానికి అపారమైన విలువను సృష్టిస్తోందని స్టాలిన్ ప్రశంసించారు.

Jaguar Land Rover of Tata Motors manufacturing facility in Ranipet inaugurated by the CM MK Stalin

టాటాకు బలమైన బ్రాండ్ విలువ ఉందని, తమిళనాడుకు టాటా గ్రూప్‌తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళనాడులో ఈ అభివృద్ధికి తాము అనుసరిస్తోన్న ద్రావిడ నమూనా పాలనే కారణమని అభిప్రాయపడ్డారు. అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం మాత్రమే కాకుండా, వాటిని ప్రాజెక్టులుగా మార్చి అమలు చేయాలని ఎప్పుడూ చెబుతుంటానని వ్యాఖ్యానించారు. ల్యాండ్ రోవర్ తయారీ కేంద్రం ద్వారా 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, వేలాదిమందికి పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

ఈ ప్లాంట్ నుండి మొదటి రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్ విడుదలైంది. కంప్లీట్లీ నాక్డ్ డౌన్ వాహన అసెంబ్లీ కార్యకలాపాలను పుణే నుండి ఈ అత్యాధునిక కేంద్రానికి మార్చింది టాటా మోటార్స్. ఈ ప్లాంట్‌పై టాటా మోటార్స్ 9,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని కేటాయించింది. రాబోయే అయిదు నుండి ఏడు సంవత్సరాలలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లను పెంచనుంది. తొలి దశలో 900 కోట్ల పెట్టుబడితో 20,000 రేంజ్ రోవర్ వాహనాలను ఉత్పత్తి చేస్తారు.

ప్రతి వాహనానికి సుమారు 1,300 విడిభాగాలు అవసరం. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడే తయారవుతాయి. ఈ ఏడాది జనవరి నాటికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (TMPV) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1,36,062.15 కోట్ల రూపాయలు. దీని ట్రాప్లింగ్ 12 నెలల నిష్పత్తి 20.6 రెట్లు అధికం. ఈ విలువ సంస్థ వృద్ధి అంచనాలను ప్రతిబింబిస్తోంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ విస్తరణలో గణనీయమైన పెట్టుబడికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పోటీదారులు భారీ మార్కెట్ క్యాప్‌లను కలిగి ఉన్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, హ్యుందాయ్, నిస్సాన్, రెనాల్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలతో ఆటోమొబైల్ తయారీ కేంద్రానికి కేరాఫ్ గా నిలిచింది.. తమిళనాడు. బీఎండబ్ల్యూ చెన్నైలో సీకేడీ ప్లాంట్‌ను కూడా నడుపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+