Jio: రూపాయి కూడా వేస్ట్ కాకుండా వాయిస్ ఓన్లీ' ప్లాన్స్.. కొత్త రీచార్జ్ ధరలివే!

స్మార్ట్‌ఫోన్లు వాడకుండా కేవలం సాధారణ ఫోన్లు వాడేవారికి, లేదా సెకండ్ సిమ్‌ను మాత్రమే యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు రీచార్జ్ చేయాలంటే ఇంటర్నెట్ డేటాతో కూడిన ఖరీదైన ప్యాక్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు, జియో ఎటువంటి డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే అందించే కొత్త ప్లాన్లను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 147 ప్రారంభ ధరతో ఈ టారిఫ్ ప్యాక్లు లభిస్తున్నాయి.

Jio Voice Only Prepaid Plans Launched Check Price Validity and SMS Benefits Starting From 147 Rupees Today
పిల్లల ప్రసంగం వింటూ కంటతడి పెట్టిన ముకేష్ అంబానీ
పిల్లల ప్రసంగం వింటూ కంటతడి పెట్టిన ముకేష్ అంబానీ

జీరో డేటా పాలసీ.. రూపాయి కూడా వృథా కాదు!

ఈ కొత్త ఆరు ప్లాన్లలోనూ ఎటువంటి ఇంటర్నెట్ డేటా లభించదు. కేవలం ఉచిత అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు మాత్రమే వర్తిస్తాయి. దీనివల్ల డేటా అవసరం లేని సాధారణ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లు లేదా స్మార్ట్‌ఫోన్ వాడని వారు అనవసరంగా డేటా ప్యాక్లపై డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పనిలేదు. అలాగే ఫోన్‌లోని మెయిన్ బ్యాలెన్స్ అకారణంగా కట్ అయిపోతుందనే భయం కూడా ఉండదు.

బంపర్ లిస్టింగ్- లాభాలు పంచి పెట్టిన జియో
బంపర్ లిస్టింగ్- లాభాలు పంచి పెట్టిన జియో

మైజియో యాప్‌లో ఎక్కడ లభిస్తాయి?

వినియోగదారులు మైజియో యాప్‌లోకి వెళ్లి 'ట్రాయ్ మాండేటెడ్ ప్యాక్స్' (TRAI Mandated Packs) ఎంచుకోవడం ద్వారా ఈ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా జియో అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర డిజిటల్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ ప్యాక్లు అందుబాటులో ఉంటాయి. మీ వద్ద ఉన్న సెకండరీ సిమ్‌ను తక్కువ ధరతో రోజూ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+