బంగారం ధరలు అనూహ్యంగా తలకిందులు- గట్టిగా దెబ్బకొట్టిన సౌదీ అరేబియా పరిణామాలు
సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను తీవ్రతరం చేశారు. రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుస క్షిపణి దాడులు జరిగిన మరుసటి రోజే, ఆ దేశ తూర్పు ప్రావిన్స్‌లోని దమ్మామ్‌లో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. మిస్సైళ్లను సంధించారు. డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు.
ఈ పరిణామాలు.. భారత్ లో బంగారం, వెండి ధరలపై పడింది. నేడు అవి తగ్గుముఖం పట్టాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పసిడి రేట్లు దిగొచ్చాయి. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో కొనుగోలుదారులకు ఈ ధరల క్షీణత కొంతవరకు ఊరటనిచ్చే పరిణామంగా మారింది. మరోవంక ముడిచమురు ధరలు పెరగడం, రూపాయితో పోల్చుకుంటే డాలర్ మరింత బలపడటం వంటి పరిణామాలు పసిడి, వెండి రేట్లపై ప్రభావం చూపాయి.

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.41 శాతం మేర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,51,100 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.16 శాతం మేర క్షీణించి రూ. 2,25,770 స్థాయి వద్ద కొనసాగింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 440 రూపాయల మేర క్షీణత కనిపించింది. 22 క్యారెట్లు- రూ. 400, 18 క్యారెట్లు రూ. 330 మేర తగ్గాయి.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,51,060 పలికింది. 22 క్యారెట్లు రూ. 1,38,472 వద్ద నిలవగా, వెండి కిలో రూ. 2,25,720 వద్ద ట్రేడ్ అయింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,820 పలికింది. 22 క్యారెట్లు రూ. 1,38,252 వద్ద నిలవగా, వెండి కిలో రూ. 2,25,540 వద్ద ట్రేడ్ అయింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,50,940 పలికింది. 22 క్యారెట్లు రూ. 1,38,362 వద్ద నిలవగా, వెండి కిలో రూ. 2,25,540 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,51,400, రూ. 1,38,783, రూ. 2,26,270 వద్ద నమోదయ్యాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,370
ముంబై..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,324
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,324
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,324
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,324
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 15,098, 22 క్యారెట్లు - రూ. 13,840, 18 క్యారెట్లు - రూ. 11,324












Click it and Unblock the Notifications
