హుటాహుటిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ.. వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్ రేట్లను పెంచింది. పెట్రోల్ లీటర్ కు రూ. 5, డీజిల్ లీటర్ రూ. 3 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ధరలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, రిఫైన్డ్ ప్రొడక్ట్ ఖర్చులు భారీగా పెరగడం, దేశీయ రిటైల్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నయారా ఎనర్జీ తెలిపింది.

దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి దాదాపు 7,108 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడటం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి నయారా ఈ ధరలను సవరించాల్సి వచ్చింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం నయారా సంస్థకు ఇది కొత్తేమీ కాదు.

Nayara Energy has raised petrol and diesel with immediate effect seeking to narrow the gap costs

ఈ ఏడాది మార్చిలో ఇరాన్ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా వీటి రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల భారాన్ని వినియోగదారులపై బదిలీ చేసిన మొదటి సంస్థ నయారా ఎనర్జీనే కావడం గమనార్హం. ఆ సమయంలో కూడా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచడంతో వాటి ధరలు ఆయా బంకుల్లో వరుసగా రూ.100.71, రూ.91.31 కి చేరాయి. ఆ తర్వాత జూలై 1 నాటికి పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణగడంతో కంపెనీ పెంచిన ధరలను ఉపసంహరించుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టింది. ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ రిటైలర్లు మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటారు. ఈ ఏడాది మే లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దశలవారీగా ఇంధన ధరలను పెంచాయి. లీటర్ కు దాదాపు రూ. 7.50 వరకు అదనపు భారాన్ని వాహనదారులపై మోపాయి. ప్రైవేట్ రంగంలో ఉండే నయారా ఎనర్జీ ఎప్పటికప్పుడు గ్లోబల్ రేట్లను బట్టి ధరలను సవరిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రైవేట్ ఇంధన సంస్థలైన జియో బీపీ వంటివి కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు లేకపోలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూ వెళ్తే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా తమ రేట్లను సవరించే అవకాశాలను పరిశీలిస్తాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+