కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం: భారీగా నష్టపోయిన మార్కెట్లు
ముంబై: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం ప్రభావం మార్కెట్ల పైన పడింది. బుధవారం మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. టీడీపీ అవిశ్వాసానికి తోడు ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉండటంతో దెబ్బపడింది. ఆరంభంలో రికార్డుస్థాయిని చేరుకున్న సూచీలు ఆ తర్వాత పడిపోయాయి. లాభనష్టాల్లో ఊగిసలాడి చివరకు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 146 పాయంట్లు పతనమై 36,373కు పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,980కి దిగజారింది. అంతకుముందు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సెన్సెక్స్ 36,747 (ఇంట్రాడే) వద్ద సరికొత్త లైఫ్ టైమ్ గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 70 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ఆ తర్వాత నష్టాలను చవిచూశాయి.

బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఔషధ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ షేర్లు లాభపడగా, టాటా స్టీల్, హిండాల్కో, వేదాంత లిమిటెడ్, టాటా మోటార్స్ నష్టపోయాయి.












Click it and Unblock the Notifications