నెలకు రూ.80వేల వరకు డబ్బు సంపాదించే సువర్ణావకాశం ఇస్తున్న పోస్టాఫీస్!
ఉద్యోగం లేదని, ఉపాధి లేదని బాధ పడే వారికి సువర్ణావకాశం. ప్రస్తుత కాలంలో బోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు దొరక్క బాధపడుతున్న వారికి, తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ఇండియన్ పోస్టల్ సర్వీస్. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ పథకం ద్వారా కష్టపడి పనిచేసిన వారు ప్రతినెల గౌరవప్రదమైన డబ్బును సంపాదించుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది.
కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్‌తో చిన్న పోస్టల్ సేవల కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఇండియన్ పోస్టల్ అవకాశం ఇస్తుంది. పోస్టల్ సేవల కేంద్రం ఏర్పాటుకు డిపాజిట్ చేసే సెక్యూరిటీ డబ్బు ఐదువేల రూపాయలు సాధారణంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ఫ్రాంచైజీ ఫీజు,రాయల్టీ వంటివి ఉండవు.ఈ అవుట్లెట్ ద్వారా వివిధ పోస్టల్ సేవలను అందించి వాటిపైన కమిషన్ రూపంలో ఆదాయం పొందవచ్చు.

రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ బుకింగ్, మనీ ఆర్డర్లు వంటి సేవలు అందించవచ్చు. ప్రతి రిజిస్టర్డ్ ఆర్టికల్‌పై రూ.3, స్పీడ్ పోస్ట్‌పై రూ.5, మనీ ఆర్డర్‌పై రూ.3.50 నుంచి రూ.5 వరకు కమిషన్ లభిస్తుంది. నెలకు నిర్దేశిత లక్ష్యాలు చేరుకుంటే అదనపు 20 శాతం ఇన్సెంటివ్ కూడా వస్తుంది. కస్టమర్లు బాగా ఉంటే, బాగా నడప గలిగితే కస్టమర్స్ రద్దీని బట్టి నెలకు రూ.20,000 నుంచి రూ.80,000 వరకు సంపాదించే అవకాశం ఉంది.
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ 2026 పథకం ద్వారా లబ్ధిని పొందాలనుకునేవారు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు అయి ఉంటే సరిపోతుంది. అయితే కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలి. చిన్న దుకాణదారులు, నిరుద్యోగులు, గృహిణులు, పదవీ విరమణ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 150-200 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు. అక్కడ పోస్టల్ సేవల కేంద్రాన్ని నడిపించవచ్చు.
కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం మరింత మెరుగైన సేవలను అందించే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రాంచైజీని నడపాలి అనుకునే వారు సమీప డివిజనల్ పోస్టల్ ఆఫీస్‌లో దరఖాస్తులను సమర్పించాలి. అవసరమైన పత్రాలు, బిజినెస్ ప్లాన్‌తో పాటు దరఖాస్తు చేస్తే ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇండియన్ పోస్టల్ తో ఒప్పందం కుదురుతుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంది. తక్కువ పెట్టుబడితో, స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది అనుకూలమైన అవకాశం. మరెందుకు ఆలస్యం ఉద్యోగాల కోసం విసిగి వేసారి పోయిన, ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న వారు ఈ ఫ్రాంచైజీ లను ఏర్పాటు చేసుకుంటే గౌరవంగా బ్రతకవచ్చు.














Click it and Unblock the Notifications
