ట్రంప్ కామెంట్స్ పై ఆర్బీఐ గవర్నర్ షాకింగ్ రియాక్షన్..!
భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన మూడవ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను నిర్వహించింది. రెపో రేటును 5.5% వద్ద స్థిరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయ వృద్ధి కొనసాగుతుందని, కానీ అంతర్జాతీయ వాణిజ్య ముప్పులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ట్రంప్ సుంకాలపై ఆర్‌బీఐ గవర్నర్ కామెంట్స్..
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. "వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. మేము అనుసంధానంతో పనిచేస్తున్నాం. ప్రతీకార చర్యల అవసరం లేకుండా పరిష్కారం దొరకాలని ఆశిస్తున్నాం" అని తెలిపారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చన్నారు.

IMF, RBI, USA: వృద్ధి అంచనాల తేడా..
అంతే కాకుండా భారత్ 6.4% వృద్ధితో ప్రపంచ వృద్ధికి 18% తోడ్పడుతుందని, ఇది అమెరికా (11%) కంటే ఎక్కువగా ఉందని అన్నారు. ఇది ట్రంప్ వ్యాఖ్యలపై పరోక్షంగా గవర్నర్ మల్హోత్రా స్పందించినట్లు భావించవచ్చు.
ద్రవ్య విధాన ముఖ్యాంశాలు..
-
రెపో రేటు: 5.5% వద్ద స్థిరంగా ఉంచారు
-
జీడీపీ వృద్ధి అంచనా: 2025-26కి 6.5%
-
సీపీఐ ద్రవ్యోల్బణ అంచనా: 3.7% నుంచి 3.1%కి తగ్గింపు
-
కరెంట్ ఖాతా లోటు (CAD): స్థిరంగా ఉండే అవకాశం
-
తదుపరి ఎంపీసీ సమావేశం: సెప్టెంబర్ 29 - అక్టోబర్ 1, 2025
మార్కెట్ ప్రభావం..
ఆర్‌బీఐ నిర్ణయం తర్వాత బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలు భారీ నష్టాలను చవిచూశాయి:
-
బోష్: -4.85%
-
ప్రెస్టేజ్ ఎస్టేట్స్: -2.68%
-
ఇండస్‌ఇండ్ బ్యాంక్: -2.58%
ఈ రంగాలు తక్కువ వడ్డీ రేటులపై ఆధారపడే వాణిజ్య కార్యకలాపాలు నడుపుతుండటంతో, రేటు మార్పు లేకపోవడం ప్రతికూలంగా ప్రభావం చూపింది.
-
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!












Click it and Unblock the Notifications