క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్.. ఇలా అయితే కష్టమే !!

ప్రస్తుతం నేటి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా ఎక్కువైంది. ఉద్యోగులు అంతా ఎక్కువగా పలు బ్యాంకుల కార్డులను వాడుతున్నారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు అంటే కేవలం షాపింగ్ కోసమే అన్నట్టు ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం జీతాల విషయంలో ఇబ్బందులు పడే వారికి క్రెడిట్ కార్డు చాలా వరకు ఆదుకుంటుంది. జీతం నెల చివరి వరకు సరిపోని పరిస్థితుల్లో ఈ కార్డులను గట్టిగా వాడేస్తున్నారు.

అందులో భాగంగానే ముఖ్యంగా రెంట్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ లక్షలాది మంది జీవితాలను సులభతరం చేసింది. ఒక్క క్లిక్‌తో అద్దె చెల్లింపు, డబ్బు అవసరమైతే వ్యక్తిగత లోన్‌లా వాడుకోవడం జరుగుతుంది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఊహించని ట్విస్ట్ వచ్చింది. క్రెడిట్ కార్డు వినియోగదారులు అంతా ఎక్కువగా వాడే ఆప్షన్ ని ఇకపై రద్దు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది.

rbi-shocking-decision-on-credit-cards-rent-payment-option

ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే రెంట్ పేమెంట్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో, ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ఆప్షన్‌ను తమ యాప్‌ల నుంచి తొలగించేశాయి. నిజానికి, ఈ సేవలను చాలామంది అత్యవసరాలకు ఉపయోగించుకున్నారు. కానీ కొందరు దీనిని దుర్వినియోగం చేస్తూ అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారని బ్యాంకులు, ఆర్బీఐ గుర్తించాయి. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కొన్ని బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటివి అద్దె చెల్లింపులపై 1% ఫీజును వసూలు చేస్తున్నాయి. రివార్డు పాయింట్లు నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఇవన్నీ చివరికి ఈ సేవలను పూర్తిగా నిలిపివేయడానికి దారి తీశాయని అంటున్నారు. ఇది అవసరానికి వాడుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. దాంతో ఇక ఇప్పుడు నగదు అవసరాల కోసం కొత్త దారులను వెతుక్కోక తప్పదు. మరి భవిష్యత్తులో ఈ సేవలు మళ్లీ అందుబాటులోకి వస్తాయా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+