వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్:ఒడిదొడుకుల్లో మార్కెట్, స్వల్ప నష్టాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక ఎలక్షన్స్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పై పడనుందా??

న్యూఢిల్లీ:కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పలితాలు స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా కన్పించింది. మార్కెట్ మంగళవారం నాడు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంది.నష్టాలతోనే మార్కెట్లు ముగిశాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన వెంటనే ప్రీ ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 35,707 వద్ద, నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,839 వద్ద కొనసాగాయి.అయితే బిజెపి అభ్యర్ధులు కాంగ్రెస్ కంటే ముందంజలో ఉన్నారని ఫలితాలు రావడంతో సెన్సెక్స్ 420 పాయింట్లకు జంప్ అయింది.

Sensex Gains Over 200 Points As BJP Pulls Ahead In Karnataka, Rupee Recovers

కన్నడ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఉదయం కాంగ్రెస్‌, భాజపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఆ తర్వాత భాజపా ఆధిక్యంలోకి వెళ్లింది.
బిజెపి ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత ఒక దశలో 400 పాయింట్లకు పైగా చేరింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయింది.
కానీ, మధుపర్ల లాభాలు స్వీకరణతో మధ్యాహ్నానికి ఆరంభ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ స్వల్ప లాభంతోనే కదలాడింది.

మధ్యాహ్నం తర్వాత కనీస మెజారిటీకి దూరంగా బిజెపి నిలిచింది. ఈ తరుణంలో జెడి(ఎస్)తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ సై అంది. సీఎం పదవి కూడ జెడి(ఎస్)కు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకొన్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 35,544 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 10,802 వద్ద స్థిరపడ్డాయి.

English summary
Reversing early losses, the Sensex and Nifty moved higher as BJP pulled ahead in Karnataka elections, according to early leads. Markets had opened flat as early leads indicated Congress and BJP locked in close fight in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X