భారీ నష్టాలు: సెన్సెక్స్ 500పాయింట్లు, నిఫ్టీ 11,400, మరింత క్షీణించిన రూపాయి
ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ వైపు అమెరికా-చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధ పరిస్థితులు.. మరోవైపు రూపాయి పతనం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సోమవారం ఉదయం సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ కూడా 100పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అయ్యింది. ఇక దేశీయంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల సూచీలను కుదిపేశాయి. దీంతో ఆరంభం నుంచే భారీ నష్టాల్లో సాగిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత మరింత దిగజారాయి.

చివరి గంటల్లో సెన్సెక్స్ 511 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 505పాయింట్లు నష్టపోయి 37,585 వద్ద స్తిరపడింది. అటు నిఫ్టీ కూడా 137 పాయింట్ల నష్టంతో 11,378 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 59పైసలు నష్టపోయి 72.44గా కొనసాగుతోంది.
ఎన్ఎస్ఈలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, టెక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నష్టపోయాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications