Union Budget 2025: కేంద్ర బడ్జెట్ తర్వాత రేట్లు తగ్గే వస్తువులు ఇవే.. జస్ట్ నాలుగు రోజులు ఆగండి!

2025 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది బడ్జెట్‌పై కూడా ప్రజలలో విశేషమైన ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు ప్రతి భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. నిత్యావసరాల ధరల నుండి ఆదాయపన్ను సడలింపుల వరకు, ప్రతి అంశం ప్రజల జీవనానికి ముడిపడి ఉంటుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా పన్ను మార్పులు నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. తద్వారా మధ్య తరగతి ప్రజల జీవితానికి కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి:

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ "డిజిటల్ ఇండియా" కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, డిజిటల్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తున్నారు. ఈ దిశలో, ఈసారి బడ్జెట్‌లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వంటి డిజిటల్ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన భాగాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే, ఎలక్ట్రానిక్ వస్తువుల ఖర్చులు తగ్గవచ్చు. దీని వల్ల మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరలకు లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందువల్ల డిజిటల్ ఇండియా లక్ష్యం మరింతగా చేరువవుతుంది.

These are the items whose rates will be reduced after the Union Budget Just wait for four days

వాహనాలు- ఇతర పరికరాలపై ప్రభావం

విద్యుత్ వాహనాల రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున, ఈసారి విద్యుత్ వాహనాలపై పన్ను రాయితీలు లేదా మరింత ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఇది ఈ రంగ అభివృద్ధికి దోహదపడగలదు. అంతేకాకుండా, బడ్జెట్ నిర్ణయాలు ఆటోమొబైల్ రంగంపై కూడా ప్రభావం చూపవచ్చు.

టెలికాం రంగంలో ప్రజల ఆశలు:

మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరల పెరుగుదల ప్రస్తుతం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. టెలికాం కంపెనీలు సాంకేతికత, మౌలిక వసతులపై ఖర్చులు పెరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, బడ్జెట్‌లో ఈ రంగానికి ఎలాంటి ఉపశమనం లభిస్తుందో చూడాలి. బడ్జెట్‌లో తీసుకునే చర్యల వల్ల మధ్య తరగతి ప్రజలకు మరింత ప్రయోజనం కలగాలని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ధరల తగ్గింపులు, పన్ను సడలింపులు వంటి అంశాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయి. డిజిటల్ ఉత్పత్తులు మరియు నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు ద్వారా ప్రజలు మరింత లాభం పొందే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ ప్రకటనలో ఏఏ కీలక నిర్ణయాలు వెలువడతాయో, ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+