వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018లో బడ్జెట్: గాలిలో దీపం మహిళా భద్రత.. ఖర్చుగానీ 50% ‘నిర్భయ’ నిధులు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం 2013 డిసెంబర్‌లో 23 ఏళ్ల పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు యువకులు దేశ రాజధాని 'హస్తిన'లో అర్థరాత్రి వేళ దారుణంగా వేధించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత తీవ్రంగా గాయపడిన 'నిర్భయ' సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇది దేశవ్యాప్తంగా సామూహిక నిరసనలకు దారి తీసింది. దేశీయంగా కేంద్రంలోనూ, రాష్ట్రాల పరిధిలో పలు చట్టాలు, న్యాయ పరమైన చట్టాల రూపకల్పనకు దారి తీసింది. 'నిర్భయ' పేరుతో రూపొందించిన చట్టం అమలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి ముందు ఉంటామని అధికార పార్టీలు ప్రకటించాయి.

కానీ ఆచరణలో 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. నిర్భయ నిధి కింద రూ.1000 కోట్లు కార్ఫస్ ఫండ్ కేటాయించారు. రెండేళ్లు తిరిగే సరికి 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో ఆ నిధిని రూ.550 కోట్లకు కోత విధించేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే నిధి కేటాయించారు. ఇప్పుడు ఆ కార్ఫస్ ఫండ్ రూ.3100 కోట్లకు చేరుకున్నది.

 Union Budget 2018 | Dear Mr Arun Jaitley, Here's Why You Should Not Feed More Money Into the Nirbhaya Fund

రూ.3100 కోట్లకు చేరిన నిర్భయ కార్ఫస్ 'ఫండ్'
నిర్భయ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 2013లో ప్రారంభంలో రూ.100 కోట్ల కార్ఫస్ ఫండ్ కేటాయించింది. దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత, రక్షణ పెంచడానికి తీసుకునే చర్యలు పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ నిధులు కేటాయించింది. కానీ నాలుగేళ్లుగా ఈ నిధుల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన తీరు చాలా నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉన్నది. కాకపోతే 'నిర్భయ' ఫండ్ కార్ఫస్ ఫండ్ కనుక ఎప్పటికీ మురిగిపోదంటే అతిశయోక్తి కాదు. 'నిర్భయ' ఫండ్ వినియోగంపై కేంద్ర హోంశాఖ నెల రోజుల క్రితం పార్లమెంట్‌లో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఈ పథకం కింద 18 ప్రాజెక్టులు ఆమోదించాం అన్నది. ఆ ప్రాజెక్టులకు ఈ కార్ఫస్ ఫండ్ కేటాయించలేదని హోంశాఖ వివరణ ఇచ్చింది.

వినియోగానికి నోచుకోని 50 శాతం నిధులు
కేంద్ర హోంశాఖ తెలిపిన ప్రకటన ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేటాయించిన నిదుల్లో 50 శాతం కూడా ఇటీవలి కాలంలో ఖర్చు కాలేదు. ఉదాహరణకు రైల్వేశాఖ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఈఆర్ఎంఎస్) పథకం ప్రకారం అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో ప్రతి రోజూ 24 గంటల పాటు మహిళలకు భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశం. కీలకమైన రైల్వేస్టేషన్లతోపాటు కంట్రోల్ రూంల వద్ద భద్రత పటిష్ట పర్చాల్సి ఉన్నది. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)ను నియమించాలన్నది కేంద్ర ప్రభుత్వోద్దేశాల్లో ఒకటి. కానీ ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తే రూ.50 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం ఈ పథకం అమలు తీరుపట్ల ప్రభుత్వానికి గల శ్రద్ధ అవగతమవుతూనే ఉన్నది.

 Union Budget 2018 | Dear Mr Arun Jaitley, Here's Why You Should Not Feed More Money Into the Nirbhaya Fund

సైబర్ నేరాల నియంత్రణకు రూ. 82 కోట్లు ఖర్చు
మహిళలు, బాలలపై సైబర్ నేరాల నివారణకు కేంద్ర హోంశాఖ రూ.195.83 కోట్లు ఆమోదించింది. కానీ రూ.82 కోట్లు మాత్రం ఖర్చయ్యాయి. మహిళలపై నేరాల దర్యాప్తు కోసం విచారణ యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.324 కోట్లు కేటాయించింది కేంద్ర హోంశాఖ. ఆసక్తకరమైన విషయమేమిటంటే కేంద్ర హోంశాఖ ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నది అదీ కూడా కారణాలేమీ చెప్పకుండానే మరి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేరాల దర్యాప్తుపై ఇలా
ఇక 2015లో మరో అడుగు ముందుకేసి కేంద్ర హోంశాఖ, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సమ భాగస్వామ్యంతో అత్యధిక నేరాలు గల జిల్లాల్లో కేసుల దర్యాప్తులో భాగస్వామి కావాలని నిర్దేశించింది. లైంగిక దాడి, వరకట్నం హత్య, యాసిడ్ దాడి, మహిళల అక్రమ రవాణా, కేసుల ఫిర్యాదునకు ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టేందుకు ఈ నిధులు ఖర్చు చేయాలని సంకల్పించింది. వ్యవస్థీక్రుత నేరాల దర్యాప్తు సంస్థకు రూ.83.20 కోట్లలో ఒక్క పైసా ఖర్చు చేయలేదు. మహిళా శిశు అభివ్రుద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభయ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల, బాలికల సురక్షిత ప్రయాణానికి రూ.138.49 కోట్లు ఖర్చు చేస్తే రూ.58.64 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి.

Recommended Video

Budget 2018-19 : 2018 బడ్జెట్‌లో రైల్వే

ఢిల్లీ పోలీసు శాఖలో ప్రత్యేక యూనిట్ కోసం రూ.23.53 కోట్లకు రూ.2.35 కోట్లు ఖర్చు
ఢిల్లీ పోలీసు శాఖలో మహిళలు, బాలల సంరక్షణ కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసేందుకు రూ.23.53 కోట్లు కేటాయిస్తే రూ.2.35 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం పరిస్థితి వైఫల్యానికి దారి తీసింది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన కౌన్సిలర్ల నియామకానికి రూ.5.07 కోట్లు కేటాయించినా కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.

English summary
New Delhi: In December 2012, a 23-year-old paramedical student was gang-raped and brutally tortured by six men in Delhi, leading to her death days later. This led to massive protests across the country, triggering a series of legislative and legal reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X