వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ మధ్య ఒప్పందం?: రిపోర్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఈ- కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ప్రపంచంలోనే ఆన్‌లైన్ రిటైలర్‌గా పేరున్న వాల్‌మార్ట్ సంస్థతో ప్లిప్‌కార్ట్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతోందనే ప్రచారం సాగుతోంది.

మరో రెండు మూడు వారాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.ఈ ఒప్పందం డీల్ విలువ సుమారు 80 వేల కోట్ల రూపాయాలుగా ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రూ.1లక్షా20 వేల కోట్లుగా ఉండే అవకాశం ఉంది.

 Walmart Close To Buying Controlling Stake In Flipkart In $12 Billion Deal: Report

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటా ఉన్న జపాన్ సంస్థ సాఫ్ట్‌ బ్యాంక్ గ్రూప్ మాత్రం వాల్‌ మార్ట్ ఆఫర్‌ పై ఆసక్తి చూపడంలేదని సమాచారం. రూ.80 వేల కోట్ల ఈ డీల్ చాలా తక్కువని ఆ సంస్థ ఆలోచనగా ఉందంటున్నారు. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్‌, సాఫ్ట్‌బ్యాంకు ఇంకా అధికారికంగా స్పందించలేదు. , అటు వాల్‌మార్ట్‌ ప్రతినిధి ఈ వార్తలపై వ్యాఖ్యానిచేందుకు తిరస్కరించారు.

వాల్‌మార్ట్ రాకతో ఫ్లిప్‌కార్ట్‌ లో ఇప్పటివరకు ఉన్నటువంటి సౌతాఫ్రికాకు చెందిన నాస్పర్స్, యాక్సెల్, అమెరికాకు చెందిన టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థలు తమ పూర్తి వాటాను విక్రయించేందుకు యోచిస్తున్నాయి.

English summary
Walmart Inc could seal a deal to buy a more than 51 per cent stake in online marketplace Flipkart as early as next week, two sources familiar with the matter said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X