EPFO: ఒకే టైంలో రెండు జాబ్స్ చేస్తున్నారా? పీఎఫ్ రూల్స్ ఏంటో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ఆర్థిక అవసరాల రీత్యా కొందరు ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు (ఒకటి మెయిన్ జాబ్, మరోటి పార్ట్ టైం) చేస్తుంటారు. అయితే ఇలా వేర్వేరు చోట్ల పనిచేస్తున్నప్పుడు పీఎఫ్ జమ అవుతుంటే చాలా మందిలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. రెండు చోట్లా పనిచేస్తున్నప్పుడు పీఎఫ్ ఖాతాలు వేర్వేరుగా ఉంటాయా? వేర్వేరు యూఏఎన్ నంబర్లు తీసుకోవాలా? అనే అయోమయం సర్వసాధారణం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం దీనికి సంబంధించిన స్పష్టత లేకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఒకే యూఏఎన్.. వేర్వేరు మెంబర్ ఐడీలు

మీరు రెండు వేర్వేరు కంపెనీల్లో ఒకే సమయంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఆ రెండు సంస్థలు మీకు పీఎఫ్ కట్ చేస్తాయి. అలాంటప్పుడు ప్రతి ఉద్యోగానికి వేర్వేరు యూఏఎన్ నంబర్లు ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు కూడా. ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉద్యోగికి ఉండేది ఒకే ఒక్క 'యూనివర్సల్ అకౌంట్ నంబర్'. మీరు ఏ సంస్థలో మారినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఆ పర్మినెంట్ యూఏఎన్ నంబర్ ఒక్కటే ఉంటుంది. కాకపోతే, మీరు పనిచేసే ప్రతి సంస్థ మీకు ఒక ప్రత్యేకమైన 'మెంబర్ ఐడీ'ని కేటాయిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు మీ పాత యూఏఎన్ నంబర్‌ను మాత్రమే కొత్త కంపెనీకి ఇవ్వాలి.

Working Two Jobs Simultaneously Here is What Happens to Your EPF Membership and Common UAN Usage

చందాలు, పింఛన్ లెక్కలు ఎలా ఉంటాయ్?

రెండు సంస్థల్లోనూ మీ పీఎఫ్ చందాలు విడివిడిగానే లెక్కించబడతాయి. సాధారణంగా ఉద్యోగి జీతంలో నుంచి 12 శాతం, యజమాని వాటా నుంచి మరో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటాయి. అయితే రెండు చోట్లా కలిపి మీ జీతం నిర్ణీత పరిమితిని దాటినప్పుడు, ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ వర్తించకపోతే ఆ మొత్తం నేరుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోనే జమ అవుతుంది. ఏ కంపెనీ మానేసినా, ఆయా యాజమాన్యాలు తమ సంస్థకు సంబంధించి మీరు ఉద్యోగం వదిలిన తేదీని (Date of Exit) ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తాయి. దీనివల్ల ఒక ఉద్యోగం పోయినా మరొక ఉద్యోగం యథావిధిగా కొనసాగుతుంది.

EPF: టేక్ హోమ్ శాలరీ మారనుందా? మీ పే-స్లిప్‌లో భారీ మార్పులు..
EPF: టేక్ హోమ్ శాలరీ మారనుందా? మీ పే-స్లిప్‌లో భారీ మార్పులు..

పొరపాటున రెండు యూఏఎన్ నంబర్లు వస్తే ఏం చేయాలి?

చాలా మంది రెండో ఉద్యోగంలో చేరినప్పుడు కొత్త కంపెనీ వారు కొత్త యూఏఎన్ నంబర్‌ను జనరేట్ చేసేలా చేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఈపీఎఫ్‌ఓ విధానం "ఒక ఉద్యోగి - ఒకే పీఎఫ్ ఖాతా" (One Employee - One EPF Account) అనే సూత్రంపై పనిచేస్తుంది. ఒకవేళ మీ పొరపాటు వల్ల లేదా కంపెనీల తప్పిదం వల రెండు యూఏఎన్ నంబర్లు జనరేట్ అయితే వాటిని అలా వదిలేయకూడదు. వెంటనే ఈపీఎఫ్‌ఓ అధికారులను సంప్రదించి, ఆ రెండు ఖాతాలను విలీనం (Merge) చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేటప్పుడు లేదా బదిలీ చేసేటప్పుడు తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి.

EPFO: 2009 నుంచి పని చేస్తున్న వారికి పీఎఫ్! అక్టోబర్ 31 వరకు గోల్డెన్ చాన్స్
EPFO: 2009 నుంచి పని చేస్తున్న వారికి పీఎఫ్! అక్టోబర్ 31 వరకు గోల్డెన్ చాన్స్

రికార్డులను క్లీన్‌గా ఉంచుకోవడం ఎందుకు ముఖ్యం?

బహుళ ఉద్యోగాలు చేసేవారు ఎప్పుడూ తమ పీఎఫ్ రికార్డులను సరిచూసుకుంటూ ఉండాలి. డిజిటల్ సేవలు పెరుగుతున్న తరుణంలో మీ పీఎఫ్ ఖాతాకు ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా అనుసంధానించబడి ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. భవిష్యత్తులో మీ రిటైర్మెంట్ డబ్బులను ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాలంటే ఈ చిన్న జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. రెండు ఉద్యోగాలు చేయడం తప్పు కాదు కానీ, పీఎఫ్ విషయంలో మాత్రం ఒకే యూఏఎన్ నంబర్‌ను వాడడమే అత్యంత సురక్షితమైన మార్గం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+