చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత పార్టీలో ఆరని చిచ్చు: తన్నుకుంటోన్న ఈపీఎస్-ఓపీఎస్: ఆఫీస్ తలుపులు పగొలగొట్టి

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే చీలిక తప్పట్లేదు. పార్టీలో ద్వినాయకత్వాన్ని కొనసాగించడంపై ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం ప్రారంభం కావడానికి ముందే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయం ముందు హైడ్రామా చోటు చేసుకుంది. పార్టీ నాయకులు నిట్ట నిలువునా చీలిపోయారు. ద్వినాయకత్వాన్ని మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తోండటమే దీనికి ప్రధాన కారణం.

ఆరని చిచ్చు..

తమిళనాడు అసెంబ్లీలో ఏఐఏడీఎంకేకు ఉన్న సంఖ్యాబలం..66. అయిదు మంది ఎంపీలు కూడా ఉన్న ఈ పార్టీ దాదాపు పతనం అంచుల్లో నిలిచింది. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలనే విషయం మీద పార్టీ నాయకుల్లో ఏర్పడిన భేదాభిప్రాయాలు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మిత్రపక్షంగా కొనసాగుతున్నందున.. ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంది.

సర్వసభ్య సమావేశం..

దీనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను భర్తీ చేసేలా తీర్మానం చేయాలనే విషయం మీద మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు తలెత్తాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారాయి. కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. చెన్నై శివార్లలోని వనగరంలో గల ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయంలో కొద్దిసేపటి కిందటే సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మొత్తం 16 తీర్మానాలను రూపొందించారు. వాటిపై చర్చించిన అనంతరం ఆమోదించాల్సి ఉంది.

తలుపులు పగొలగొట్టి..

ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఈ సమావేశానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వం వర్గానికి అవకాశం ఇవ్వకూడదని పళనిస్వామి భావించారు. ఆయన వర్గానికి చెందిన నాయకులు గానీ, మద్దతుదారులు గానీ పార్టీ కార్యాలయంలోని రాకుండా తలుపులు మూసివేశారు. ఇది కాస్తా వారికి మరింత ఆగ్రహానికి గురి చేసింది. తలుపులు బద్దలు కొట్టి మరీ పన్నీర్ సెల్వం మద్దతుదారులు సర్వసభ్య సమావేశంలోనికి దూసుకెళ్లారు.

ఫ్లెక్సీలు, బ్యానర్లు దగ్ధం..

ఫ్లెక్సీలు, బ్యానర్లు దగ్ధం..


ఈ సమావేశం ప్రారంభం కావడానికి ముందు ఈపీఎస్-ఓపీఎస్ మద్దతుదారులు వందలాది సంఖ్యలో పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎవరికి వారు తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీనితో వనగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇద్దరు నేతల మద్దతుదారులు ఒకదశలో ఘర్షణకు దిగారు. పన్నీర్ సెల్వం వర్గానికి కార్యాలయంలోనికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహోదగ్రులయ్యారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఫర్నిచర్‌, ఫ్లెక్సీలు, బ్యానర్లను తగులబెట్టారు.

సుప్రీంకోర్టు అనుమతితో..

సుప్రీంకోర్టు అనుమతితో..

సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చిన వెంటనే.. ఈ భేటీ మొదలైంది. కిందటి నెల నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీర్ సెల్వంపై వాటర్ బాటిళ్లు విసిరేసిన విషయం తెలిసిందే. 1972లో పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రధాన కార్యదర్శి పోస్ట్ అనేది ఖాళీగా ఉంటూ వస్తోంది. దీన్ని భర్తీ చేసేలా బైలాస్‌లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. అది కుదరట్లేదు.

బైలాస్‌లో మార్పులు..

బైలాస్‌లో మార్పులు..


పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో కూడిన ద్వినాయకత్వాన్ని స్వస్తి పలికి.. ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ను భర్తీ చేసేలా బైలాస్‌లో మార్పులు చేయాలంటూ జనరల్ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించాలని పార్టీ నిర్ణయించగా.. అది బెడిసి కొట్టింది. పళనిస్వామి వర్గం దీన్ని వ్యతిరేకిస్తోందనే ప్రచారం ఉంది. 2,700 మంది సభ్యులతో కూడిన జనరల్ కౌన్సిల్‌లో 2,500 మంది తమ మద్దతుదారులేనంటూ పన్నీర్ సెల్వం వర్గం చెబుతోన్నప్పటికీ.. తాజా భేటీలో ఆయనపైనే వాటర్ బాటిళ్లు విసరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
A clash breaks out between supporters of AIADMK leaders E Palaniswami and O Panneerselvam near party headquarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X