పట్టపగలు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ ను నడిరోడ్డులో నరికి చంపేసి దర్జాగా ఎస్కేప్!
చెన్న/మధురై: రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించాడు. అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉండటంతో అతను సైలెంట్ గా ఉంటున్నాడు. సిటీలో చదువుకుంటున్న కుమార్తెను చూడటానికి ఆ కౌన్సిలర్ వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు మార్గం మధ్యలోనే ఆ కౌన్సిలర్ ను అడ్డగించి పట్టపగలు దారుణంగా చంపేశారు.
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని మౌతుపట్టి ప్రాంతంలో చంద్రపాండియన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అమ్మయనాయకనూరు మునిసిపాలిటి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి చంద్రపాండియన్ కౌన్సిలర్ గా విజయంసాధించాడు. గత నాలుగు సార్లు జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రపాడింయన్ వరుసగా కౌన్సిలర్ గా విజయం సాధిస్తూ వచ్చాడు.

10 సంవత్సరాలు రెండుసార్లు వరుసగా తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రపాండియన్ హవా కొనసాగిందని, మునిసిపాలిటిలో అన్ని పనులు చేయించుకున్నాడని తెలిసింది. తరువాత తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.
డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నాడీఎంకే కౌన్సిలర్ చంద్రపాండియన్ సైలెంట్ అయిపోయాడని తెలిసింది. చంద్రపాండియన్ కుమార్తె మధురైలో చదువుకుంటూ అక్కడే హాస్టల్ లో ఉంటున్నది. కుమార్తెను చూడటానికి చంద్రపాండియన్ బైక్ లో ఒక్కడే మధురైకి బయలుదేరాడు. మధురైలోని పాలమేడు ప్రాంతం సమీపంలో ప్రత్యర్థులు చంద్రపాండియన్ బైక్ ను అడ్డగించి వేటకొడవళ్లు, కత్తులతో అతన్ని నరికి అక్కడికక్కడే చంపేసి పారిపోయారు.
విషయం తెలుుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. రాజకీయ కక్షల కారణంగానే అన్నాడీఎంకే పార్టీ కౌన్సిలర్ చంద్రపాండియన్ హత్యకు గురైనాడని, కేసు విచారణలో ఉందని మధురై పోలీసులు అన్నారు. పట్టపగలు ఓ రాజకీయ నాయకుడిని నడిరోడ్డులో నరికి చంపడం మధురైలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications