Aunty: పండుగకు పిలిచిన అత్తతో బూతులు మాట్లాడిన అల్లుడు, కొడవలితో నరికి చంపేసిన మామ, కూతురు!

చెన్నై/ తేన్ కాశీ: కూతురికి మంచి పెళ్లి కొడుకును చూసి పెళ్లి చెయ్యాలని అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నో కళలుకన్నారు. రెండు సంవత్సరాల పాటు కూతురి కోసం అనేక పెళ్లి సంబంధాలు చూశారు. తరువాత తెలిసిన వాళ్లు, కొందరు బంధువులు ఓ అబ్బాయి చాలా మంచోడు, అతనికి మీ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని చెప్పారు. బంధువులు, పెద్దల సూచన మేరకు ఆరు నెలల క్రితం కూతురి పెళ్లి అదే యువకుడితో జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద పెళ్లి కొడుక్కి బంగారు నగలు, నగదు కట్నం కింద ఇచ్చారు.

మొదటి సంక్రాంతి పండుగ సందర్బంగా అల్లుడికి అదనంగా కూతురి తరపున బంగారు నగలు ఇచ్చారు. సంక్రాంతి పండుగకు వెళ్లిన అల్లుడు ఆమె అత్తను నీఛంగా, చలకనగా మాట్లాడాడు. బంధువులు, కుటుంబ సభ్యులు అందరి ముందు అల్లుడు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన అత్తను బూతులు తిట్టడంతో మామ రగిలిపోయాడు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి పిలిపించిన అల్లుడిని అతని మామ దారుణంగా వెంటాడి వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది.

కూతురి పెళ్లి చెయ్యాలని ఆరాంటం

కూతురి పెళ్లి చెయ్యాలని ఆరాంటం

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని కడయనల్లూరు మునిసిపాలిటి పరిధిలోని ఇందిరా కాలనీలో కన్నన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కన్నన్ కు పెళ్లి వయసుకు వచ్చిన కర్పూర జ్యోతి అలియాస్ జ్యోతి అనే కూతురు ఉంది. పెళ్లి వయసుకు వచ్చిన కూతుడు జ్యోతికి మంచి పెళ్లి కొడుకును చూసి పెళ్లి చెయ్యాలని అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నో కళలుకన్నారు.

పెళ్లి కొడుకు చిక్కాడని ఆనందం

పెళ్లి కొడుకు చిక్కాడని ఆనందం

రెండు సంవత్సరాల పాటు కూతురె జ్యోతి కోసం ఆమె తండ్రి కన్నన్ అనేక పెళ్లి సంబంధాలు చూశాడు. తరువాత తెలిసిన వాళ్లు, కొందరు బంధువులు పులియంగుడిలోని డీఎన్ పుదుక్కుడిలో నివాసం ఉంటున్న శరత్ కుమార్ అనే అబ్బాయి చాలా మంచోడు, అతనికి మీ కూతురు జ్యోతిని ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె తండ్రి కన్నన్ కు చెప్పారు. పెళ్లి కొడుకు శరత్ కుమార్ చిక్కారని జ్యోతి కుటుంబ సభ్యులు సంతోషించారు.

ఆరు నెలల ముందే పెళ్లి

ఆరు నెలల ముందే పెళ్లి

బంధువులు, పెద్దల సూచన మేరకు ఆరు నెలల క్రితం కూతురు జ్యోతిని శరత్ కుమార్ కు ఇచ్చి సంతోషంగా, గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద పెళ్లి కొడుకు శరత్ కుమార్ కు పెళ్లి కూతురు జ్యోతి కుటుంబ సభ్యులు బంగారు నగలు, నగదు కట్నం కింద ఇచ్చారు.

మొదటి సంక్రాంతి పండుగ

మొదటి సంక్రాంతి పండుగ

తమిళనాడులో మామూలుగానే సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరపుకుంటారు. ఇక కొత్తగా పెళ్లి అయిన ఇంట్లో పెళ్లి కొడుకును పిలిపించి బంగారు నగలు ఇచ్చి పెద్ద ఎత్తున వింధు భోజనాలు ఏర్పాటు చేశారు. మొదటి సంక్రాంతి పండుగ సందర్బంగా కన్నన్ అతని అల్లుడ శరత్ కుమార్ మరోసారి అదనంగా కూతురు జ్యోతి తరపున బంగారు నగలు ఇచ్చారు. సంక్రాంతి పండుగకు కూతురు జ్యోతితో పాటు అల్లుడు శరత్ కుమార్ ను పిలిపించారు.

 కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన అత్తను బూతులు తిట్టిన అల్లుడు

కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన అత్తను బూతులు తిట్టిన అల్లుడు

సంక్రాంతి పండుగకు భార్య జ్యోతి పుట్టింటికి వెళ్లిన అల్లుడు శరత్ కుమార్ అడిగినంత కట్నం ఇవ్వలేదని కోపంతో అతని అత్తను నీఛంగా, చలకనగా మాట్లాడాడు. బంధువులు, కుటుంబ సభ్యులు అందరి ముందు అల్లుడు శరత్ కుమార్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన అత్తను బూతులు తిట్టడంతో మామ కన్నన్ రగిలిపోయాడు. మొదటి సంక్రాంతి పండుగకు ఇంటికి పిలిపించిన అల్లుడు శరత్ కుమార్ ను అతని మామ కన్నన్ ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

పండుగ పూట ఒకే ఇంట్లో రెండు విషాదాలు

పండుగ పూట ఒకే ఇంట్లో రెండు విషాదాలు

పండగపూట ఇంటికి వెళ్లిన అల్లుడు శరత్ కుమార్ ను అతని మామ కన్నన్ హత్య చెయ్యడం తేన్ కాశీ జిల్లాలో కలకలం రేపింది. కట్టుకున్న భర్త శరత్ కుమార్ ను కన్న తండ్రి కన్నన్ హత్య చెయ్యడంతో పెళ్లి జరిగి సంవత్సరం కూడా కాకుండా జ్యోతి బతుకు రోడ్డు మీదపడిందని ఆమె బంధువులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+