Aunty: మేనత్తను చంపేసి మట్టంగా పూడ్చేసిన అల్లుడు, ఆ విషయంలో భర్త, అల్లుడితో అత్తకు గొడవలు!

తంజావూర్/ చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతుల ఇద్దరు పిల్లలకు వివాహం జరిగిపోయి వాళ్లు వేరుగా నివాసం ఉంటున్నారు. వ్యాపారం చేస్తూ సొంత ఊర్లో వ్యవసాయం చేయిస్తున్న భర్త అతని భార్యను ఇంతకాలం బాగా చూసుకున్నాడు. ఓ విషయంలో చాలాకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితం భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయంది. ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయిన మహిళ కోసం కుటుంబ సభ్యులు గాలించారు.

కొన్ని రోజుల తరువాత ఊరి సమీపంలోని తోటలో ఓ మహిళ శవమై కనిపించింది. పోలీసులు గోయ్యి తీసి మహిళ శవం బయటకు తీశారు. భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. రెండు వారాల క్రితం భర్తతో గొడవపడిన మహిళ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ అయ్యారు.

అయితే మహిళ హత్య కేసుతో ఆమె భర్తకు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహిళ హత్యకు గురైన ప్రాంతంలో కొంతకాలం క్రితం ఓ వ్యక్తి చక్కర్లు కొట్టాడని, అతనే హంతకుడు అని వెలుగు చూసింది. మహిళ హత్య కేసులో ఆమె మేనల్లుడు అరెస్టు కావడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని పట్టుకోటై సమీపంలోని తిట్టుక్కుడిలో ఇళంగోవన్, అన్నపూర్ణ (52) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇళంగోవన్ వివాహం చేసుకున్న అన్నపూర్ణ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతుల ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో వాళ్లు వేరుగా నివాసం ఉంటున్నారు.

చిన్నచిన్న విషయాలకు గొడవ

చిన్నచిన్న విషయాలకు గొడవ

వ్యాపారం, సొంత ఊర్లో వ్యవసాయం చేయిస్తున్న ఇళంగోవన్ అతని భార్య అన్నపూర్ణను ఇంతకాలం బాగా చూసుకున్నాడు. ఓ విషయంలో చాలాకాలంగా ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. నిత్యం ఎందుకు మీ మద్య గొడవలు వస్తున్నాయి అంటూ బందువులు కొంతకాలం నుంచి ఇళంగోవన్, అన్నపూర్ణ దంపతులకు చివాట్లు పెడుతూ వస్తున్నారు.

సైలెంట్ గా ఉండిపోయిన భర్త

సైలెంట్ గా ఉండిపోయిన భర్త

రెండు వారాల క్రితం ఇంట్లో భర్త ఇళంగోవన్ తో గొడవపడిన అన్నపూర్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన భార్య అన్నపూర్ణ పుట్టింటికి వెళ్లి ఉంటుందని ఆమె భర్త అనుకున్నాడు. తరువాత భార్య ఆచూకి లేకపోవడంతో ఇళంగోవన్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఊరి శివార్లలోని కొబ్బరి తోటలో ఓ మహిళను పూడ్చి పెట్టారని వెలుగు చూడటంతో తంజావూరు జిల్లా పోలీసులు రంగంలోకి దిగి గోయ్యి తీసి ఆమె శవం బయటకు తీశారు.

చంపేసి పూడ్చేశాడు

చంపేసి పూడ్చేశాడు

కొన్ని రోజుల క్రితం ఇళంగోవన్ తో గొడవపడి బయటకు వెళ్లిన అతని భార్య అన్నపూర్ణ (52) అనే మహిళ కొబ్బరి తోటలో శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. రెండు వారాల క్రితం భర్త ఇళంగోవన్ తో గొడవపడి వెళ్లి పోయిన అన్నపూర్ణ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు హడలిపోయారు. అయితే అన్నపూర్ణను హత్య చేసిన హంతకుడు అంత త్వరగా పోలీసులకు చిక్కలేదు.

మేనల్లుడే హంతకుడు

మేనల్లుడే హంతకుడు

అన్నపూర్ణ హత్య కేసుతో ఆమె భర్త ఇళంగోవన్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అన్నపూర్ణ హత్యకు గురైన ప్రాంతంలో కొంతకాలం క్రితం ఆమె మేనల్లుడు మురుగానందం (30) చక్కర్లు కొట్టాడని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మురుగానందం అసలు మ్యాటర్ చెప్పాడు.

రూ. కోట్ల ఆస్తి కోసం అత్తనే చంపేశాడు

రూ. కోట్ల ఆస్తి కోసం అత్తనే చంపేశాడు

హత్యకు గురైన అన్నపూర్ణకు ఆ ప్రాంతంలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని పోలీసులు అన్నారు. నీ పేరుతో ఉన్న ఆస్తులు తన పేరు మీద రాసివ్వాలని చాలాకాలం నుంచి మురుగానందం అతని అత్త అన్నపూర్ణ మీద ఒత్తిడి చేశాడని, ఆస్తి మేనల్లుడి మీద రాసి ఇవ్వడానికి ఆమె నిరాకరించిందని పోలీసులు అన్నారు.

చంపేసి సైలెంట్ గా ఉండిపోయిన శాడిస్టు

చంపేసి సైలెంట్ గా ఉండిపోయిన శాడిస్టు

రెండు వారాల క్రితం అన్నపూర్ణను హత్య చేసిన మురుగానందం ఆమె శవాన్ని బైక్ లో తీసుకెళ్లి పూడ్చి పెట్టేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. అన్నపూర్ణ హత్య కేసులో ఆమె మేనల్లుడు మురుగానందం అరెస్టు కావడం కలకలం రేపింది. ఆస్తి కోసం సొంత మేనత్త అన్నపూర్ణను హత్య చేసిన మురుగానందంకు ఎలాంటి ఫీలింగ్ లేదని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+