నువ్వు దేవుడు సామీ! రూ. 20కే కిలో టమాట అమ్మిన వ్యాపారి
చెన్నై: దేశ వ్యాప్తంగా టమాట ధరలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో టమాట కిలో ధర రూ. 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. అయితే, ఓ వ్యాపారి మాత్రం దేవుడిలా వచ్చి సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాడు. తమిళనాడులోని చెన్నైకి చెందని ఓ వ్యాపారి కిలో టమాట కేవలం రూ. 20కే విక్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. కడలూరుకు చెందిన రాజేష్(38) అనే వ్యక్తి కూరగాయల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు . గత కొద్ది రోజులుగా టమాటాల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల తన దుకాణ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సాయపడాలని నిర్ణయించుకున్నాడు రాజేష్. ఇందుకోసం బెంగళూరు నుంచి కిలో రూ. 60 చొప్పున.. 550 కిలోలు చేశాడు. అనంతరం వాటిని తన దుకాణంలో కిలో రూ. 20కే విక్రియంచాడు.

కూరగాయలు కొనుగోలు చేయలేని పేదవారికి సాయం చేయడానికి తక్కవ ధరకు విక్రయించినట్లు తెలిపాడు. ఎక్కువ మంది లాభపడాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తికి కిలో మాట్రమే కొనుగోలు చేయాలని ముందుగానే సూచించినట్లు తెలిపాడు. అయినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే మొత్తం స్టాక్ ఖాళీ కావడం గమనార్హం. ఎందుకంటే చాలా మంది వచ్చి టమాటలు తక్కువ ధరకు రావడంతో కొనుగోలు చేశారు.
కాగా, 2019లోనూ తన షాపు ప్రారంభించిన సమయంలో ఉల్లిపాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుడు కూడా తాను రూ. 10కే కిలో ఉల్లి విక్రియంచినట్లు రాజేష్ తెలిపాడు. తన షాప్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూరగాయలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఏది ఏమైనా.. టమాట ధరలు భారీగా పెరిగిన కష్టకాలంలో రూ. 20కే కిలో టమాట ఇవ్వడం అభినందించదగిన విషయమే. కాగా, మరుసటి రోజు నుంచి మాత్రం కిలో టమాటను రూ. 48 చొప్పున విక్రయించాడు. ఇది కూడా మార్కెట్ ధర కన్నా తక్కువే కావడం గమనార్హం. మరోవైపు, టమాట ధరలు పెరిగిన క్రమంలో రేషన్ షాపులో టమాటలను రూ. 60కి కిలో చొప్పున ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications