Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

boyfriend: ప్రియుడితో లేచిపోయిన కూతురు, వాడు ఎవడు ?, తల్లిదండ్రులు ఏం చేశారంటే, షాక్ తో!

ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని కూతురు మొహమాటం లేకుండా నేరుగా చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇద్దరిది వేరే కులం. అసలు వాడు చేస్తున్న పని ఏమిటి అని కూతుర్ని ఆమె తల్లిదండ్రులు నిలదీశారు.

చెన్నై/తుత్తుకూడి: చదువుకుంటున్న అమ్మాయికి, ఓ యువకుడికి పరిచయం అయ్యింది. కాలేజ్ కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి వస్తున్నది. కూతురు కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్లి వస్తోందని అమ్మాయి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే జరిగింది వేరే స్టోరీ. యువతి ఓ యువకుడిని ప్రేమించి అతనితో తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఊహించలేకపోయారు.

చివరికి ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని కూతురు మొహమాటం లేకుండా నేరుగా చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇద్దరిది వేరే కులం. అసలు వాడు చేస్తున్న పని ఏమిటి అని కూతుర్ని ఆమె తల్లిదండ్రులు నిలదీశారు. దెబ్బకు ఇంట్లో ఇద్దరి శవాలు లేవడం కలకలం రేపింది.

కూతురి కోసం

కూతురి కోసం

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని దైవచెయ్యల్ పురం సమీపంలోని క్రిష్ణాపురంలో చిన్నదురై, శంకరమ్మాళ్ దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్నదురై, శంకరమ్మాళ్ కుమార్తె సెల్వి (పేరు మార్చడం జరిగింది) కాలేజ్ లో చదువుకుంటున్నది.

కాలేజ్ కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెలుతున్న అమ్మాయి సాయంత్రం ఇంటికి వస్తున్నది. కూతురు కాలేజ్ లో చదువుకోవడానికి వెళ్లి వస్తోందని అమ్మాయి తల్లిదండ్రులు చిన్నదురై, శంకరమ్మాల్ దంపతులు అనుకున్నారు. కూతురిని ఆమె తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటున్నారు.

కూతురి లవ్ స్టోరీ

కూతురి లవ్ స్టోరీ

కాలేజ్ లో చదువుకుంటున్న సెల్వీకి పుదుపట్టిలో నివాసం ఉంటున్న కాళిముత్తు అలియాస్ ముత్తు అనే యువకుడితో పరిచయం అయ్యింది. కాళిముత్తు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం పాటు కాళిముత్తు అతను ఏం పని చేస్తున్నాడు అనే విషయం సెల్వీకి తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. తరువాత కాళిముత్తు, సెల్వీ ప్రేమించుకున్నారు. కాలేజ్ కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెలుతున్న సెల్వీ ఆమె ప్రియుడు కాళిముత్తుతో తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

మర్యాదగా ఉండాలని తల్లిదండ్రులు వార్నింగ్

మర్యాదగా ఉండాలని తల్లిదండ్రులు వార్నింగ్

తాను తన ప్రియుడు కాళిముత్తును పెళ్లి చేసుకుంటానని సెల్వీ ఆమె తల్లిదండ్రులు చిన్నదురై, శంకరమ్మాల్ కు చెప్పింది. కుమార్తె ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆమె తల్లిదండ్రులు చిన్నదురై, శంకరమ్మాల్ ఖండించారు. వాడు లారీ డ్రైవర్, నువ్వు ఇంత వరకు బాగానే ఉన్నావు, ఇక ముందు కూడా బాగుండాలని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు చిన్నదురై, శంకరమ్మాళ్ కూతురు సెల్వీకి బుద్దిమాటలు చెప్పారు.

 కూతురు లేచిపోయిందని తల్లిదండ్రుల ఆత్మహత్య

కూతురు లేచిపోయిందని తల్లిదండ్రుల ఆత్మహత్య

ప్రేమికులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీరి ప్రేమను చిన్నదురై, శంకరమ్మాళ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రియుడు కాళిముత్తును పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు సెల్వీ ఇంటి నుంచి పారిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి శంకరమ్మాళ్ ఇంట్లో, తండ్రి చిన్నదురై అడకలాపురంలో విషం తాగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

తల్లిదండ్రుల ప్రాణం తీసిన కూతురి లవ్ మ్యారేజ్

తల్లిదండ్రుల ప్రాణం తీసిన కూతురి లవ్ మ్యారేజ్

తరువాత విషయం గుర్తించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ కులం వాడితో కూతురు లేచిపోయి పరువు తీసిందని అనుకున్న చిన్నదురై, శంకరమ్మాల్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+