చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cool Drinks: రూ. 10 కూల్ డ్రింక్ తాగి అమ్మాయి ప్రాణం పోయింది, నీలి రంగులోకి శరీరం, 17 మంది !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవిస్తున్న అక్కాచెల్లి పగటి పూట సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా స్కూల్ మూసి వేయడంతో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లో వంట చేసి పెట్టిన తల్లి ఎప్పటి లాగా ఆమె పనికి ఆమె వెళ్లిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయి సమీపంలోని షాపులోకి వెళ్లి కూల్ డ్రింగ్ తీసుకుని తాగింది. కూల్ డ్రింక్ తాగిన కొంత సేపటికే ఆ అమ్మాయి కిందపడిపోయి స్పృహ తప్పిపోయింది. సోదరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆమె అక్క గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. అయితే అమ్మాయి శరీరం నీలి రంగులోకి మారిపోయి ఆమె ప్రాణం పోవడం కలకలం రేపింది. బయటకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న కూతురు సాయంత్రం ఇంటికి వెళ్లి చూసే సరికి శవమై కనిపించడంతో బాలిక తల్లి ఆర్తనాదాలు చేసింది. కూల్ డ్రింక్ తాగి ప్రాణం పోయిన అమ్మాయితో పాటు మరో 17 మందికి కూల్ డ్రింక్స్ విక్రయించారని తెలుసుకున్న పోలీసులు ఎవరెవరు కూల్ డ్రింక్స్ తీసుకున్నారు అని ఆరా తియ్యడానికి రంగంలోకి దిగారు.

Illegal affair: భర్తకు అరటి పండు, ప్రియుడికి జామపండు, మిడ్ నైట్ మసాలా, థ్రిల్లర్ సినిమా !Illegal affair: భర్తకు అరటి పండు, ప్రియుడికి జామపండు, మిడ్ నైట్ మసాలా, థ్రిల్లర్ సినిమా !

హ్యాపీ జీవితం

హ్యాపీ జీవితం

చెన్నై సిటీలోని కల్పాక్కం సమీపంలో సతీష్, గాయిత్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్, గాయిత్రీ దంపతులకు అశ్వినీ (16), ధరణి (13) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి సతీష్, గాయిత్రీ దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. కరోనా వైరస్ మహహ్మారి కారణంగా స్కూల్ మూసి వేయడంతో గాయిత్రీ ఆమె ఇద్దరు కుమార్తెలు అశ్వినీ, ధరణిని పిలుచుకుని చెన్నైలోని బెసంట్ నగర్ లోని తల్లి ఇంటిలో ఉంటోంది.

 ఆడుకుంటున్న అక్కా, చెల్లి

ఆడుకుంటున్న అక్కా, చెల్లి

ప్రతిరోజు అమ్మ గాయిత్రీ చేసి పెట్టే వంట తింటున్న అశ్వినీ, ధరణి సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఉదయం ఇంట్లో వంట చేసి పెట్టిన తల్లి గాయిత్రీ ఎప్పటి లాగా ఆమె పనికి ఆమె వెళ్లిపోయింది. తల్లి గాయిత్రీ పనికి వెళ్లి పోయిన తరువాత ఇంటి ముందు సాటి స్నేహితులతో కలిసి అశ్వినీ, ధరణి ఆడుకుంటున్నారు.

రూ. 10 కూల్ డ్రింక్

రూ. 10 కూల్ డ్రింక్

అశ్వినీ, ఆమె చెల్లెలు ధరణి ఆడుకుంటున్నారు. కొంత సేపటి తరువాత ధరణి ఇంటి సమీపంలోని షాపులోకి వెళ్లి రూ. 10 ఇచ్చి కూల్ డ్రింగ్ తీసుకుని తాగింది. కూల్ డ్రింక్ తాగిన కొంత సేపటికే ధరణి కిందపడిపోయి స్పృహ తప్పిపోయింది. చెల్లెలు ధరణి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆమె అక్క అశ్వినీ గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది.

 ఆసుపత్రిలో చికిత్స

ఆసుపత్రిలో చికిత్స

చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు ధరణిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ధరణి ముక్కులో నుంచి రక్తం కారిపోయింది. చికిత్స చేసిన తరువాత ధరణిని మళ్లీ ఇంటికి పిలుచుకుని వెళ్లారు. తరువాత ధరణి శరీరం నీలిరంగులోకి మారిపోయి ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ?

కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ?

ధరణి శరీరం నీలి రంగులోకి మారిపోయి ఆమె ప్రాణం పోవడం కలకలం రేపింది. బయటకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న కూతురు ధరణి సాయంత్రం ఇంటికి వెళ్లి చూసే సరికి శవమై కనిపించడంతో బాలిక తల్లి గాయిత్రీ ఆర్తనాదాలు చేసింది. విషయం తెలుసుకున్న శాస్త్రీనగర్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ చేశారు. కాలం చెల్లిపోయిన కూల్ డ్రింక్ తాగడం వలనే ధరణి ప్రాణం పోయిందని శాస్త్రీ నగర్ పోలీసులు గుర్తించారు.

17 మందికి అమ్మేశారు

17 మందికి అమ్మేశారు


గాయిత్రీ కూల్ డ్రింక్ తీసుకున్న కిరాణ స్టోర్ లో మిగిలిన కూల్ డ్రింక్స్ బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు తాము 17 మందికి కూల్ డ్రింక్స్ బాటిల్స్ విక్రయించామని ఆ షాపు యజమాని పోలీసులకు చెప్పాడు. షాపులో ఉన్న మిగిలిన కూల్ డ్రింక్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించారు.

కిరాణా షాపులో ఓల్డ్ స్టాక్

కిరాణా షాపులో ఓల్డ్ స్టాక్

ధరణి కూల్ డ్రింక్స్ తీసుకుని తాగిని కిరాణా షాపు ఆ ప్రాంతంలోనే చాలా కాలం నుంచి ఉందని పోలీసు అంటున్నారు. ఈ షాపులో నిత్యం ఓల్డ్ స్టాక్ విక్రయిస్తుంటారని, కాలం చెల్లిపోయిన కూల్ డ్రింక్ తాగడం వలనే ధరణి ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కిరాణా షాపు యజమాని ఆ కూల్ డ్రింక్స్ ఎక్కడ తీసుకు వచ్చాడు ?, ఆ కూల్ డ్రింక్ విషపూరితం అయ్యాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కూల్ డ్రింక్స్ ఎవరెవరు తీసుకెళ్లారు ?

కూల్ డ్రింక్స్ ఎవరెవరు తీసుకెళ్లారు ?

కిరాణా షాపులో ఇప్పటికే 17 మందికి కూల్ డ్రింక్స్ విక్రయించడంతో ఆ కూల్ డ్రింక్స్ ఎవరు తీసుకెళ్లారు అని శాస్త్రీ నగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారు కాకుండా బయట వ్యక్తులు ఎవరైనా ఆ కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్లారా ?, కూల్ డ్రింక్స్ తాగి ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓల్డ్ స్టాక్ సరుకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో తమిళనాడు ఆహార భద్రతా, తనికీల శాఖ అధికారులు కిరాణా స్టోర్ లోని అన్ని నిత్యవసర వస్తువులను పరిశీలిస్తున్నారు. కూల్ డ్రింక్ తాగిన రెండు మూడు గంటల్లో 13 ఏళ్ల అమ్మాయి ప్రాణం పోవడంతో చెన్నై ప్రజలు ఉలిక్కిపడ్డారు.

English summary
Cool Drinks: 13 year old girl died after buying cooldrinks at grocery store in Chennai City in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X