చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో డీఎంకే అభ్యర్ధుల జాబితా విడుదల-కొలత్తూర్‌ నుంచి స్టాలిన్ పోటీ

|
Google Oneindia TeluguNews

తమిళనాడులో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ 173 మందితో కూడిన అభ్యర్ధుల జాబితాను డీఎంకే ప్రకటించింది. ఇందులో పార్టీ అధినేత ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధితో పాటు పలువురు సీనియర్‌ నేతల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ చోటు దక్కింది.

తమిళనాడులో డీఎంకే తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాను పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ ఇవాళ విడుదల చేశారు. మొత్తం 173 మంది సభ్యుల జాబితాలో పార్టీల పలువురు సీనియర్‌ నేతలతో పాటు కొత్త వారికీ చోటు దక్కింది. అధినేత స్టాలిన్‌ మరోసారి కొలత్తూర్‌ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చేపాక్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు అల్లాడి అరుణ, సురేష్ రాజన్‌, కన్నప్పన్, మాజీ స్పీకర్‌ అవుడయ్యప్పన్‌తో పాటు పలువురు చోటు దక్కించుకున్నారు.

DMK Releases List; MK Stalin to Contest from Kolathur, Udayanidhi from Chepauk

తమిళనాడు అసెంబ్లీలో 234 స్ధానాలకు ఏప్రిల్‌ 6న ఒకే దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో డీఎంకే, కాంగ్రెస్‌, సీఫీఐ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో 173 స్ధానాలకు డీఎంకే పోటీ చేస్తుండగా.. 25 స్ధానాల్లో కాంగ్రెస్‌, మిగిలిన సీట్లతో సీపీఐ పోటీ చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ సీట్ల సర్దుబాటు ఆధారంగా జరగదని, సిద్ధాంతాల ఆధారంగానే ఉంటుందని స్టాలిన్ ప్రకటించారు. తన తండ్రి కరుణానిధి పోటీ చేస్తున్నట్లు భావించి అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.

English summary
dmk releases list of candidates for upcoming assembly elections in tamilnadu. party chief mk stalin to contest from kolathur and his son udayanidhi to contest from chepauk seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X