కొత్త పెళ్లికొడుకును కిడ్నాప్ చేసి దారుణంగా చంపేసిన భార్య ఫ్యామిలీ, స్టోరీ డిఫరెంట్!

చెన్నై/ కరూర్: ఒకే ఊరిలో యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. చాలాకాలం నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఇది అన్ని లవ్ స్టోరీలాల్లో రొటీన్ కథ అనుకుంటే పొరపాటే. అందరిలాగే పెద్దలను ఎదిరించిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే కొత్త పెళ్లి కొడుకును కిడ్నాప్ చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు అతన్ని అతిదారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

తమిళనాడులోని కరూరు జిల్లాలోని కరుపంపట్టిలో క్రిష్ణమూర్తి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తిరువూర్ లోని ఓ బనియన్లు తయారు చేసే పెద్ద గార్మెంట్స్ ఫ్యాక్టరీలో క్రిష్ణమూర్తి ఉద్యోగం చేస్తున్నాడు. క్రిష్ణమూర్తి నివాసం ఉండే గ్రామంలోనే గోపిక అనే యువతి నివాసం ఉంటున్నది. ఉద్యోగం చేస్తున్న క్రిష్ణమూర్తి ప్రతినెల ఊరికి వచ్చి వెలుతున్నాడు.

Family members of the wife who kidnapped and murdered the newly married son near Karur in Tamil Nadu

కొన్ని సంవత్సరాల నుంచి గోపిక, క్రిష్ణమూర్తి ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలీకుండా గోపిక, క్రిష్ణమూర్తి రహస్యంగా కలిసి తిరుగుతున్నారు. ఈ విషయం ఇరువైపుల కుటుంబ సబ్యులకు తెలిసిపోయింది. గోపిక, క్రిష్ణమూర్తిల పెళ్లికి వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా నిరాకరించారు.

అందుకు కారణం వరుసకు క్రిష్ణమూర్తి, గోపిక అన్నాచెల్లెలు అవుతారు. క్రిష్ణమూర్తి చిన్నాన కుమార్తె గోపిక. అన్నాచెల్లెలు పెళ్లి చేసుకుంటే ఊరిలో రెండు కుటుంబాలు తల ఎత్తుకుని తిరగలేవని, మీరు పెళ్లి ేసుకోవడానికి వీలులేదని ఇరువైపుల కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. ఇటీవల ఇంటి నుంచి పారిపోయిన క్రిష్ణమూర్తి, గోపిక గుడిలో పెళ్లి చేసుకుని తిరువూరులో కాపురం పెట్టారు.

రెండు రోజుల క్రితం కరూరులో ఓ కోర్టు కేసు విచారణకు క్రిష్ణమూర్తి హాజరైనాడు. తరువాత కోర్టు నుంచి బయలుదేరి బైక్ లో ఊరికి వెలుతున్న క్రిష్ణమూర్తిని కారులో వెళ్లిన కొందరు అడ్డగించి అతన్ని అదే కారులో కిడ్నాప్ చేశారు. రెండు రోజులు అయినా క్రిష్ణమూర్తి ఇంటికి రాకపోవడంతో అతని భార్య గోపిక ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టింది.

పోలీసులు గోపిక కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ఆ సందర్బంలో అసలు మ్యాటర్ బయటకు రావడంతో గోపిక కుప్పకూలిపోయింది. గోపిక అన్న రవివర్మన్, అతని స్నేహితుడు దినేష్, గోపిక తల్లి హేమలతా, అమ్మమ్మ పాపవతి కలిసి క్రిష్ణమూర్తిని కిడ్నాప్ చేసి అతని గొంతు కోసి శవాన్ని నదిలో విసిరేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. క్రిష్ణమూర్తి శవం కోసం గాలిస్తున్నామని, గోపిక కుటుంబ సభ్యులు అందరిని అరెస్టు చేశామని కరూర్ జిల్లా పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+