Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాంగ్ సినిమా సీన్ రిపీట్: ఏసీబీ అధికారులమంటూ జ్యూవెలరీ షాప్‌లోకెళ్లిన కి'లేడీ'లు.. ఏం జరిగిందంటే!!

సినిమాల ప్రభావమో ఏమో తెలియదు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న అనేక ఘటనలు అచ్చు సినిమాలలో జరుగుతున్న సంఘటనల మాదిరిగా ఉంటున్నాయి. తాజాగా చెన్నైలో జువెలరీ షాప్ లో ఇద్దరు నకిలీ ఏసీబీ అధికారులు హల్ చల్ చేశారు. అక్కడి సిబ్బందిని హడలెత్తించాడు. అచ్చం సూర్య, రమ్యకృష్ణ నటించిన గ్యాంగ్ సినిమా తరహాలో ఏసీబీ అధికారులమంటూ హల్చల్ చేసిన సదరు కిలాడీలు చివరకు అడ్డంగా బుక్కయ్యారు.

షో రూమ్ కు వెళ్లి బంగారం షాపింగ్ చేసి ఏసీబీ అధికారులమని ఇద్దరు కిలేడీల హంగామా

షో రూమ్ కు వెళ్లి బంగారం షాపింగ్ చేసి ఏసీబీ అధికారులమని ఇద్దరు కిలేడీల హంగామా

అసలేం జరిగిందంటే తూత్తుకుడి బస్ స్టాండ్ రోడ్డు లో ప్రముఖ వస్త్ర దుకాణం తో పాటుగా, జువెల్లరీ షోరూం కూడా నిర్వహిస్తున్నారు. అయితే అక్కడకు బాగా అఫీషియల్ గా రెడీ అయ్యి వచ్చిన ఇద్దరు మహిళలు గంటన్నరపాటు షాపింగ్ చేసి, 10 సవర్ల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఇక ఆ బంగారం తాలూకు బిల్లు చెల్లించే క్రమంలో జ్యూవెలరీ షాపు యజమానిని పిలిపించాలని, తాము ఏసీబీ అధికారులమని సిబ్బందిపై ఒత్తిడి తీసుకువచ్చారు. తాము ఏసీబీ అధికారులుగా చెప్పిన వారు వారి గుర్తింపు కార్డులు చూపించారు.

నకిలీ ఏసీబీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్

నకిలీ ఏసీబీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్


అయితే ఏసీబీ అధికారులని వారు చెప్పడంతో అక్కడి సిబ్బంది కాస్త కంగారు పడినప్పటికీ, షోరూమ్ మేనేజర్ వారి ఇద్దరినీ కూర్చోబెట్టి వారికి జ్యూస్లు తెప్పించి ఇచ్చారు. వారి వ్యవహార శైలి కాస్త అనుమానాలకు తావు ఇవ్వటంతో మేనేజర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక షోరూమ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న తూత్తుకుడి సెంట్రల్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయ్యప్పన్, సిబ్బంది ఆ మహిళల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించారు.

పోలీస్ ఇన్స్పెక్టర్ ను కూడా గదమాయించిన మహిళలు .. నకిలీలని తేల్చిన ఇన్స్పెక్టర్

పోలీస్ ఇన్స్పెక్టర్ ను కూడా గదమాయించిన మహిళలు .. నకిలీలని తేల్చిన ఇన్స్పెక్టర్

ఇక ఇన్స్పెక్టర్ ను కూడా సదరు మహిళలు తాము ఏసీబీ అధికారులను అని చెబుతూ గదమాయించారు. పోలీసులను చూసినా ఎలాంటి భయం లేకుండా ప్రవర్తించారు. అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ అసలు ఏసీబీ అధికారుల ద్వారా, ఈ మహిళలకు సంబంధించి ఎక్కడ పని చేస్తారు అని వివరాలు సేకరించబోగా అసలు విషయం బయటకు వచ్చింది. వారు చూపించిన ఐడి కార్డులతో ఏసీబీ లో ఎవరూ పనిచేయడం లేదని, ఆ మహిళలకు ఏసీబీ అధికారులకు సంబంధం లేదని తేలడంతో, మహిళలు నిదానంగా అక్కడినుంచి జారుకునే ప్రయత్నం చేశారు.

 నకిలీల గుట్టు రట్టు చేసిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

నకిలీల గుట్టు రట్టు చేసిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

ఇద్దరు నకిలీ ఏసీబీ అధికారులని తెలియడంతో, మహిళా పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు. నిందితులు తూత్తుకుడికి చెందిన 40 సంవత్సరాల రాజ్యలక్ష్మి, సేలం జిల్లా ఎడపాడి పెరియకడైకు చెందిన 36 సంవత్సరాల పరమేశ్వరిగా గుర్తించారు. మొత్తానికి షోరూం యాజమాన్యాన్ని మోసం చేయాలని నకిలీ ఏసీబీ అధికారులుగా అవతారమెత్తిన మహిళలను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+