Gentlemen: భార్య, మరదలు నగలు చోరీ, ప్రియురాలికి అర్దకేజీ బంగారు నగలు ఇచ్చిన వ్యాపారి, క్లైమాక్స్ లో ? !
చెన్నై/మదురై: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం సంతోషంగా కాపురం చేశాడు. భర్త తమ్ముడు పెళ్లి చేసుకుని అన్న, వదినతో కలిసి ఉమ్మడి కాపురం ఉంటున్నారు. అన్నదమ్ములు, వారి భార్యలు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. అన్న ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న అతని భార్య గొడవపడి కట్టుబట్టలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తరువాత భర్త ఇంటిలో ఉన్న బంగారు నగలు, పట్టుచీరలు తీసుకుని వెళ్లడానికి ఇంటికి వెళ్లింది. ఇంట్లో బీరువాలో ఉన్న 350 గ్రాముల బంగారు నగలు చోరీ అయిన విషయం గుర్తించి షాక్ అయ్యింది. ఇదే సమయంలో ఆమె తోడుకోడలికి చెందిన 200 గ్రాముల బంగారు నగలు చోరీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటిలో అర్దకేజీకి పైగా బంగారు నగలు చోరీ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

ఉమ్మడి కుటుంబం
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని వూంతమల్లిలోని ముత్తునగర్ లో శేఖర్ (40) అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. రాజేష్ కొన్ని సంవత్సరాల క్రితం తమిళ సెల్వీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. శేఖర్ తమ్ముడు రాజేష్ (37) వివాహం చేసుకున్నాడు. రాజేష్, తమిళ సెల్వి దంపతులు, రాజేష్ దంపతులు ఒకే ఇంటిలో ఉమ్మడి కాపురం ఉంటున్నారు.

వ్యాపారికి అక్రమ సంబంధం
వ్యాపారి శేఖర్ వేలచ్చేరీలోని కేసరీపురంలో నివాసం ఉంటున్న స్వాతి (22) అనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త శేఖర్ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న అతని భార్య తమిళ సెల్వి గత ఏడాది ఆమె భర్తతో గొడవపడి కట్టుబట్టలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

సొంత ఇంటిలో అర్దకేజీ నగలు మాయం
కొన్ని నెలల తరువాత భర్త శేఖర్ ఇంటిలో ఉన్న బంగారు నగలు, పట్టుచీరలు తీసుకుని వెళ్లడానికి అతని భార్య తమిళ సెల్వి ఇంటికి వెళ్లింది. ఇంట్లో బీరువాలో ఉన్న 350 గ్రాముల బంగారు నగలు చోరీ అయిన విషయం గుర్తించిన తమిళ సెల్వీ షాక్ అయ్యింది. ఇదే సమయంలో రాజేష్ భార్యకు చెందిన (తమిళ సెల్వి తోడుకోడలు) 200 గ్రాముల బంగారు నగలు చోరీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. అర్దకేజీ బంగారు నగలు చోరీ కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
Recommended Video


ఇంటి దొంగ..... వ్యాపారి, ప్రియురాలు అరెస్టు
పోలీసుల విచారణలో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యాపారి శేఖర్ సొంత ఇంటిలో 550 గ్రాముల బంగారు నగలు చోరీ చేసి వేలచ్చేరీలో నివాసం ఉంటున్న అతని ప్రియురాలు స్వాతికి ఇచ్చాడని, నగలు ఇచ్చి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రియురాలు స్వాతి మోజులో పడి ఇంతకాలం సొంత ఇంటిలో నగలు, నగదు స్వాహా చేస్తున్న ఇంటి దొంగ శేఖర్ అసలు గుట్టు బట్టబయలు అయ్యింది. శేఖర్, అతని ప్రియురాలు స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications