Wife: చాక్లెట్ లాంటి ప్రియురాలిని సెట్ చేసుకున్న భర్త, అర్దరాత్రి బెడ్ రూమ్ లో భార్య ఏం చేసిందంటే!
చెన్నై/ మదురై: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా సంసారం చేశారు. దంపతులకు కూతురు పుట్టింది. 10 సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను భార్య చేదు కావడంతో చాక్లెట్ లాంటి ప్రియురాలిని సెట్ చేసుకున్న భర్త ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. భార్యకు ఏదోఒక పని మీద వెలుతున్నానని చెప్పి బయటకు వెళ్లిపోతున్న భర్త అతని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు.
రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి భర్త మీద పెట్రోల్ పోసిన భార్య అతనికి నిప్పంటించింది మంటలు వ్యాపించడంతో భర్త బయటకు పరుగు తీసి సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు, బంధువులకు అసలు విషయం చెప్పాడు. ఇంత జరిగినా భార్య ఏమాత్రం ఫీలింగ్ లేకుండా సైలెంట్ గా ఉండిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

13 ఏళ్ల క్రితం పెళ్లి
తమిళనాడులోని శివగంగై జిల్లాలోని మనమదురైలోని జీవానగర్ లో లింగనాథన్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 13 సంవత్సరాల క్రితం లింగనాథన్ కు అంగయకన్నియ అలియాస్ కన్నియ (36) అనే మహిళతో పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. లింగనాథన్చ కన్నియ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అదే సంవత్సరం ఇద్దరికి పెళ్లి చేశారు.

కూతురు పుట్టిన తరువాత టేస్ట్ మార్చిన భర్త
పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న లింగనాథన్, కన్నియ దంపతులు హ్యాపీగా సంసారం చేశారు. లింగనాథన్, కన్నియ దంపతులకు 8 సంవత్సరాల క్రితం ఓ కూతురు పుట్టింది. 10 సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన లింగనాథన్, కన్నియ దంపతుల మద్య మూడు సంవత్సరాల క్రితం గొడవలు మొదలైనాయి.

చాక్లెట్ లాంటి ప్రియురాలిని సెట్ చేసుకున్న భర్త
లింగనాథన్ కు అతని భార్య కన్నియ రానురాను చేదు కావడంతో చాక్లెట్ లాంటి స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే ప్రియురాలిని సెట్ చేసుకున్నాడు. ప్రియురాలితో లింగనాథన్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న లింగనాథన్ అతని భార్యను నిర్లక్షం చెయ్యడం మొదలుపెట్టాడు.

ఇంట్లోనే భర్త మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
లింగనాథన్ అక్రమ సంబందం విషయం అతని భార్య కన్నియకు తెలిసిపోవడంతో గొడవలు మొదలైనాయి. ఇంతకాలం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న లింగనాథన్ కుటుంబ సభ్యులు, బంధువులు సర్దిచెబుతూ వస్తున్నారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన లింగనాథన్ భోజనం చేసి నిద్రపోయాడు. అర్దరాత్రి భర్త లింగనాథన్ మీద పెట్రోల్ పోసిన కన్నియ అతనికి నిప్పంటించింది.

సైలెంట్ గా ఉండిపోయిన భార్య అరెస్టు
తలకు, భుజానికి మంటలు వ్యాపించడంతో లింగనాథన్ ఇంటి నుంచి బయటకు పరుగు తీసి సమీపంలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు, బంధువులకు అసలు విషయం చెప్పాడు. లింగనాథన్ ను ఆసుపత్రికి తరలించారు. ఇంత జరిగినా లింగనాథన్ భార్య కన్నియ ఏమాత్రం ఫీలింగ్ లేకుండా సైలెంట్ గా ఉండిపోవడంతో అందరూ హడలిపోయారు. భర్త లింగనాథ్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన అతని భార్య కన్నియను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications