Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi wife: కొవ్వు కరిగించాలని భార్య జిమ్ కు, జిమ్ మాస్టర్ కు ఫ్రూట్ జ్యూస్, భర్తకు ఖాళీ గ్లాస్!

చెన్నై/ మదురై: కొవ్వు కరిగించడానికి జిమ్ కు వెళ్లిన భార్య జిమ్ మాస్టర్ రోజూ మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ భర్తకు రాత్రి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టి ఎస్కేప్ అయ్యింది. యువతి, యువకుడు ప్రేమించిపెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. తమకు ఎందుకు పిల్లలలు పుట్టలేదని దంపతులు వైద్యులను సంప్రదించారు. గర్భసంచిలో నీరు ఉందని, యువతి శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలనే పిల్లలు పుట్టలేదని వైద్యులు చెప్పారు.

వైద్యుల సలహామేరకు జిమ్ లో కోవ్వు కరిగించుకోవడానికి వెళ్లిన భార్య జిమ్ మాస్టర్ ను తగులుకుని జివ్వుమని కొండగాలి అంటూ డ్యూయెట్లు వేసుకుంది. జిమ్ మాస్టర్ కు మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్న భార్య భర్తకు బిస్కేట్, ఖాళీ గ్లాస్ మాత్రం ఇచ్చింది. విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో జిమ్ మాస్టర్ అయిన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని భర్తకు డబుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతని కళ్లముందే ప్రియుడితో ఏం చెక్కాచెక్కేసింది.

ఎయిర్ పోర్టులో ఉద్యోగం

ఎయిర్ పోర్టులో ఉద్యోగం

తమిళనాడులోని మదురై జిల్లాలోని పెరుంగుడి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ (27) అనే యువకుడు మదురై విమానశ్రయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాజేష్, కనిమొళి అనే యువతి మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకుని తరువాత పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న రాజేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కనిమొళిని పువ్వుల్లో పెట్టి చేసుకుంటున్నాడు.

పిల్లలు పుట్టలేదని చికిత్స

పిల్లలు పుట్టలేదని చికిత్స

రాజేష్, కనిమొళి దంపతులకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో పెద్దల సలహామేరకు ఆ దంపతులు వైద్యులను సంప్రధించారు. వైద్యులు రాజేష్, కనిమొళికి వైద్యపరీక్షలు చేశారు. రాజేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని, కనిమొళి గర్బాశయంలో నీరు ఎక్కువగా ఉందని, అదే విధంగా ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టలేదని వైద్యులు చెప్పారు.

విడాకులు ఇచ్చేయ్ రా!

విడాకులు ఇచ్చేయ్ రా!

పిల్లలు పుట్టలేదంటే కనిమొళికి విడాకులు ఇచ్చి నువ్వు వేరే వివాహం చేసుకోవాలని రాజేష్ పై అతని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారని తెలిసింది. అయితే తాను ఎలాగైనా పిల్లలను కంటానని, రాజేష్ కు మాత్రం విడాకులు ఇవ్వనని కనిమొళి తేల్చి చెప్పింది. రాజేష్ కూడా కనిమొళికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేష్, కనిమొళి కలిసి జీవించాలని నిర్ణయించారు. అయితే తన భార్య కామాంధురాలని, తన జీవితంలోకి ఓ కిరాతకుడు ఎంట్రీ ఇస్తాడని రాజేష్ ఊహించలేకపోయాడు.

కొవ్వు కరిగించాలని జిమ్ కు వెళ్లి జిగేల్ జిగేల్

కొవ్వు కరిగించాలని జిమ్ కు వెళ్లి జిగేల్ జిగేల్

శరీరంలోని కొవ్వు కరిగించడానికి, గర్భాశయంలోని నీళ్లు తగ్గించుకోవడానికి కనిమొళి మదురైలోని విల్లాపురం ప్రాంతంలో యోగేష్ కన్నా నిర్వహిస్తున్న జిమ్ లో చేరింది. ప్రతిరోజు క్రమం తప్పకుండా జిమ్ కు వెలుతున్న కనిమొళి జిమ్ మాస్టర్, జిమ్ సెంటర్ యజమాని అయిన యోగేష్ కన్నాకు దగ్గర అయ్యింది. ప్రతిరోజు యోగేష్ కన్నాతో చనువుగా ఉంటున్న కనిమొళి అతనితో జిగేల్ జిగేల్ అంటూ అక్రమ సంబంధం పెట్టుకుంది.

జిమ్ మాస్టర్ కు మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్... భర్తకు బిస్కేట్

జిమ్ మాస్టర్ కు మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్... భర్తకు బిస్కేట్

ప్రతిరోజు జిమ్ కు వెళ్లి గంటలు గంటలు అక్కడే గడుపుతున్న కనిమొళి జిమ్ మాస్టర్ అయిన ప్రియుడు యోగేష్ కన్నాతో ఎంజాయ్ చేస్తూ అతనికి మిల్క్ షేక్ ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఇంటికి వెళ్లి భర్త రాజేష్ కు బిస్కేట్ ఇచ్చి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టేది. తన భార్య కనిమొళి ఎందుకు ఇలా మారిపోయింది అంటూ రాజేష్ ఆరా తీశాడు. ఆ సందర్బంలో జిమ్ మాస్టర్ యోగేష్ కన్నాకు, తన భార్య కనిమొళికి అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న రాజేష్ షాక్ కు గురైనాడు.

 రేయ్... నీ పని నువ్వు చూసుకో

రేయ్... నీ పని నువ్వు చూసుకో

నీ పద్దతి బాగలేదని, జిమ్ మాస్టర్ తో నీకు సరసాలు ఏమిటని భర్త రాజేష్ భార్య కనిమొళికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే అప్పటికే యోగేష్ కన్నాతో పీకల్లోతు అక్రమ సంబంధం పెట్టుకున్న కనిమొళి రేయ్.... నీ పని నువ్వు చూసుకో, ఎక్కువ మాట్లాడద్దు, నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోతా అంటూ భర్త రాజేష్ ను హెచ్చరించింది. ఇది ఎక్కడ గొడవ అంటూ భార్య కనిమొళిని జిమ్ కు వెళ్లనివ్వకుండా భర్త రాజేష్ అడ్డుకున్నాడు. ఇదే సమయంలో ప్రియుడు యోగేష్ కన్నాను కలవలేకపోయిన కనిమొళి రగిలిపోయింది. వెంటనే ప్రియుడు యోగేష్ కన్నాకు ఫోన్ చేసిన కనిమొళి నా భర్త రాజేష్ అంతు చూసి నన్ను ఇక్కడి నుంచి పిలుచుకుని వెళ్లిపో అని చెప్పింది.

Recommended Video

    Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
    భర్త ముందే భార్యను లేపుకుపోయిన ప్రియుడు

    భర్త ముందే భార్యను లేపుకుపోయిన ప్రియుడు

    జిమ్ మాస్టర్ యోగేష్ కన్నా అతని జిమ్ కు వస్తున్న కొందరిని వెంట పెట్టుకుని నేరుగా రాత్రి ప్రియురాలు కనిమొళి ఇంటి దగ్గరకు వెళ్లాడు. భర్త రాజేష్ ను చంపేస్తామని బెదిరించిన యోగేష్ కన్నా అతని భార్య కనిమొళిని లేపుకుని వెళ్లిపోయాడు. రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన డీఎస్పీ వినోదిని భర్త రాజేష్, భార్య కనిమొళి, జిమ్ మాస్టర్ యోగేష్ కన్నాను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. కొవ్వు తగ్గించుకోవడానికి జిమ్ కు వెలుతున్న వివాహిత మహిళను జిమ్ మాస్టర్ యోగేష్ కన్నా లేపుకుపోవడంతో ముదరైలో కలకలం రేపింది. భర్త రాజేష్ కేసు పెట్టడంతో భార్య కనిమొళి, ఆమె ప్రియుడు యోగేష్ కన్నాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+