Family: భర్త బయటకు వెళ్లి వచ్చాడు, తలుపులు పగలగొట్టి చూస్తే ఇంట్లో మూడు శవాలు, ఏం జరిగింది?
చెన్నై/మదురై: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిలో ఉంటున్న భార్య పిల్లలను చూసుకుంటున్నది. ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య ఆమె ఇద్దరు కుమారులకు విషం పెట్టి హత్య చేసి తరువాత ఆమె కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని మదురై జిల్లాలోని అలంకనల్లూరు సమీపంలోని కోవిల్ పట్టిలో అయ్యాంగార్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, 14 సంవత్సరాల క్రితం అయ్యనార్ ధనలక్ష్మి (39) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ధనలక్ష్మి, అయ్యంగార్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్త వ్యవసాయ కూలీ
అయ్యంగార్, ధనలక్ష్మి దంపతులకు హరిక్రిష్ణన్ (14), కుపేంద్రన్ (12) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యంగార్ వ్యవసాయ కూలిగా పని చేస్తూ అతని భార్య ధనలక్ష్యి, ఇద్దరు కుమారులను పోషిస్తున్నాడు. ఇంటిలో ఉంటున్న ధనలక్ష్మి ఆమె పిల్లలను చూసుకుంటున్నది. దంపతుల ఇద్దరు కుమారులు స్కూల్ లో చదువుకుంటున్నారు.

ఇంట్లో ఏం జరిగింది?
అయ్యంగార్ పని మీద బయట ఊరికి వెళ్లాడు, ఇంటికి వెళ్లి చూడగా భార్య ధనలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు తలుపులు తియ్యకపోవంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూశాడు. ఇంట్లో భార్య ధనలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు శవమై కనిపించడంతో హడలిపోయిన అయ్యంగార్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వయసు వస్తున్న కొడుకులతో?
కొంతకాలంగా అయ్యంగార్, ధనలక్ష్మి దంపతులకు గొడవలు జరుగుతున్నాయని, ముగ్గురు ఆత్మహత్యలకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. వయసుకు వస్తున్న కొడుకులను హత్య చేసిన ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం మదురై జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications