Marriage: విదేశాల్లో ఉద్యోగం, అమ్మాయి నచ్చలేదని, పెళ్లి చెయ్యలేదని తల్లిదండ్రులను ఎలా చంపాడంటే ?!
చెన్నై/ పుదుకోటై: సంతోషంగా కాపురం చేసిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి అతని ఇద్దరు కుమారులను, కూతురిని బాగా చదివించాడు. పెద్ద కొడుక్కి, కూతురికి పెళ్లి చేశారు. మరో కొడుకు విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. కొడుకు పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్న ఊరిలోనే నివాసం ఉంటున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకుకు పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు అనుకుంటున్నారు.
అయితే ఎక్కడా రెండో కొడుక్కి పెళ్లి కూతురు సెట్ కాకపోవడంతో అతనికి ఇంకా పెళ్లికాలేదు. విదేశాల నుంచి వచ్చిన కొడుకు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తరువాతే విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యి అనేక మంది అమ్మాయిలను చూశాడు. పెళ్లి కొడుక్కి అమ్మాయి నచ్చితే పెద్దలకు ఆమె నచ్చకపోవడం, పెద్దలకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకునే యువకుడికి నచ్చకపోవడం, ఇలా రకరకాల కారణాలతో ఆ యువకుడి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది.
తనకు పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ కొడుకు అతని తల్లిదండ్రులతో రోజూ గొడవ పడుతూనే ఉన్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి తన తల్లిదండ్రులే కారణం అంటూ సహనం కోల్పోయిన కొడుకు జన్మనిశ్చిన అమ్మానాన్నలను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు సైలెంట్ గా అక్కడి నుంచి చెక్కేశాడు.

వ్యవసాయం చేయిస్తున్న తండ్రి
తమిళనాడులోని పుదుకోటై సమీపంలోని నాటియంకడు గ్రామంలో రంగస్వామి (60), వల్లి (55) దంపతులు నివాసం ఉంటున్నారు. రంగస్వామి, వల్లి దంపతులకు గోపీనాథ్, బాలు అనే ఇద్దరు కుమారులు, సంగీత అనే కుమార్తె ఉన్నారు. వ్యవసాయం చేయిస్తున్న భూస్వామి రంగస్వామి అతని ఇద్దరు కుమారులను, కూతురిని బాగా చదివించాడు.

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న కొడుకు
రంగస్వామి, వల్లి దంపతులకు పెద్ద కొడుకు గోపినాథ్, కూతురు సంగీతకు పెళ్లి చేశారు. మరో కొడుకు బాలు విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. కూతురు సంగీత పెళ్లి చేసుకుని సేలంలోని ఆమె అత్తారింటికి వెళ్లిపోయింది. పెద్ద కొడుకు గోపీనాథ్ పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తున్న సేలంలోనే అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న రంగస్వామి రెండో కొడుకు బాలుకు పెళ్లి చెయ్యాలని అతని తల్లిదండ్రులు రంగస్వామి, వల్లి అనుకుంటున్నారు. అయితే ఎక్కడా రెండో కొడుకు బాలుకు పెళ్లి కూతురు సెట్ కాకపోవడంతో అతనికి ఇంకా పెళ్లికాలేదు. విదేశాల నుంచి వచ్చిన బాలు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, తరువాతే విదేశాలకు వెళ్లాలని డిసైడ్ అయ్యి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాడు.

పెళ్లి కూతురు ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చదు
పెళ్లి కొడుకు బాలుకు అమ్మాయి నచ్చితే అతని పెద్దలకు ఆమె నచ్చకపోవడం, పెద్దలకు నచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకునే బాలుకు నచ్చకపోవడం, ఇలా రకరకాల కారణాలతో ఆ యువకుడి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. తనకు పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ బాలు అతని తల్లిదండ్రులు రంగస్వామి, వల్లితో రోజూ గొడవ పడుతూనే ఉన్నాడు.
Recommended Video


పెళ్లి కాలేదని తల్లిదండ్రులను ఎలా చంపేశాడంటే?
తనకు పెళ్లి కాకపోవడానికి తన తల్లిదండ్రులు రంగస్వామి, వల్లి కారణం అంటూ సహనం కోల్పోయిన బాలు అతనికి జన్మనిశ్చిన అమ్మానాన్నలను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంటి సమీపంలో ఉన్న షెడ్ లో తండ్రి రంగస్వామిని గొంతుకు నులిమి చంపేసిన బాలు అతని తల్లి వల్లిని కొడవలితో నరికి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
తల్లిదండ్రులు రంగస్వామి, వల్లిని హత్య చేసిన కొడుకు సైలెంట్ గా అక్కడి నుంచి చెక్కేశాడు. బంధవులు వెళ్లి చూసిన తరువాతే రంగస్వామి, వల్లి దంపతులు హత్యకు గురైన విషయం వెలుగు చూసిందని, బాలు కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications