• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీవీ నటి ఆత్మహత్య: స్టార్ హోటల్‌లో..ఉరి వేసుకున్న స్థితిలో: ముందు రోజు రాత్రి ఏం జరిగింది?

|

చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఓ హోటల్‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. 28 సంవత్సరాల వయస్సున్న చిత్ర ఆత్మహత్య చేసుకోవడంపై తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌లో ఆమె నటించారు. చెన్నై నజరేట్‌పేట్టైలోని ఓ స్టార్ హోటల్‌లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమెను గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి ఆమె ఈవీపీ ఫిల్మ్‌సిటీలోని ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జామున 2:30 గంటలకు ఆమె హోటల్ గదికి చేరుకున్నారు.

బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం..

హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిరోజుల కిందటే ఆమెకు చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థమైంది. ప్రస్తుతం చిత్ర.. ఆయనతో కలిసి నివసిస్తున్నారు. ఒకవంక షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతూ.. మరోవంక వివాహానికి సిద్ధపడుతోన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక కారణాలు ఆమె ఆత్మహత్యకు దారి తీసి ఉండకపోవచ్చని అంటున్నారు.

హేమంత్‌కు చివరి ఫోన్ కాల్..

ఈవీపీ ఫిల్మ‌్‌సిటీ నుంచి నజరేట్‌పేట్టైలోని స్టార్ హోటల్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆమె తన ఫియాన్స్ హేమంత్‌కు ఫోన్ చేశారు. తాను గదికి చేరుకున్నానని, నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. అదే చివరి ఫోన్ కాల్. తెల్లవారు జామున హేమంత్ ఆమెకు ఫోన్ చేశారు. పలుమార్లు కాల్ చేసినప్పటికీ.. లిఫ్ట్ చేయలేదు. దీనితో అతను హోటల్ సిబ్బందికి ఈ సమాచారాన్ని చేర వేశారు. వారు వచ్చి పలుమార్లు తలుపులు తట్టినప్పటికీ.. సమాధానం రాలేదు. దీనితో డూప్లికేట్ తాళం చెవితో తలుపులను తెరవగా.. ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు.

టీవీ ప్రజెంటర్‌గా..

టీవీ సీరియళ్లలో విస్తృత అవకాశాలు వస్తున్నాయి. పలు టీవీ ఛానళ్లలో ప్రజెంటర్‌గా పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నిర్వహించే కొన్ని ఈవెంట్లలోనూ వీజే చిత్ర.. యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ అనే టీవీ సీరియల్‌లో నటిస్తున్నారు. ఇందులో ముళ్లై అనే పాత్రను పోషిస్తున్నారు. హ్యూజ్ ఫ్యాన్ బేస్డ్ ఉన్న నటిగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా, యూట్యూబ్‌ల ద్వారా అభిమానులను ఆలరించే ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో వీజే చిత్ర బలవన్మరణానికి పాల్పడటం అభిమానులను విషాదంలో ముంచెత్తింది.

  Rajinikanth Party Arrives In January | Oneindia Telugu

  కారణాలపై ఆరా..

  వీజే చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు. డిప్రెషన్ ఓ కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు ప్రాథమికంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక కారణాలు ఉండకపోవచ్చంటూ అభిమానులు చెబుతున్నారు. ఇతరత్రా కారణాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆమె ఫొటోలతో కూడిన సంతాప సందేశాలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. #RIPChitra అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఒక మంచి నటిని తమిళ టీవీ, చలన చిత్ర పరిశ్రమ కోల్పోయిందని వీజే చిత్ర అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Tamil TV serial actress Chitra committed suicide in a star hotel at Chennai. She was acted in Pandian stores serial.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X