చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Party War: పన్నీర్ సెల్వం మీద వేటు, బోడప్పలు ఉంటే ఎంత, పోతే ఎంత ?, ఊగిపోయిన మాజీ సీఎం, రచ్చ!

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ మరోసారి రెచ్చకెక్కింది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో లొల్లి మొదలైయ్యింది. తమిళనాడులో అధికారంలో ఉన్నంత వరకు బాగానే ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం తరువాత అధికారానికి దూరం అయిన తరువాత పార్టీలో పట్టుసాధించాలని ఒకరి మీద ఒకరు పోటీకి దిగడంతో మళ్లీ మొదటికే మోసం వచ్చింది. పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించాలని పార్టీలోని మెజారిటీ నాయకులు తీర్మాణం చెయ్యడంతో ఎడప్పాడి పళనిస్వామి పార్టీ సర్వసభ్య సమావేశంలో పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Illegal affair: అర్దరాత్రి భార్య ఫోన్ పంచాయితీ, విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే, అన్నం, నీళ్లు కూడా, అంతే !Illegal affair: అర్దరాత్రి భార్య ఫోన్ పంచాయితీ, విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే, అన్నం, నీళ్లు కూడా, అంతే !

పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం

పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం

అధికారం దూరం అయిన తరువాత తరువాత అన్నాడీఎంకే పార్టీలో పట్టుసాధించాలని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకరి మీద ఒకరు పోటీకి దిగడంతో మళ్లీ మొదటికే మోసం వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఇద్దరు నాయకులు పోటీ పడటంతో అన్నాడీఎంకేలో మళ్లీ చీలిక వచ్చింది.

పన్నీర్ సెల్వంను బహిష్కరించాలని తీర్మాణం

పన్నీర్ సెల్వంను బహిష్కరించాలని తీర్మాణం

సోమవారం చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరైనారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని నియమించాలని, పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ రెండు ప్రతిపాధనలతో పాటు మొత్తం 16 తీర్మాణాలు ప్రవేశపెట్టారు.

ఊగిపోయిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి

ఊగిపోయిన మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి

16 తీర్మాణాలు ప్రవేశపెట్టిన తరువాత ఎడప్పాపడి పళనిస్వామి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇదే సందర్బంలో ఓ పన్నీర్ సెల్వం పేరు ఎత్తకుండానే ఎడప్పాడి పళనిస్వామి ఆయన మీద, ఆయన వర్గం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి సారి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అంత అవేశంగా అన్నాడీఎంకే పార్టీ మీటింగ్ లో మాట్లాడారు.

అమ్మ అశీర్వాదంతో ఇంతవాడు అయ్యాను... వాళ్ల భిక్షతో కాదు !

అమ్మ అశీర్వాదంతో ఇంతవాడు అయ్యాను... వాళ్ల భిక్షతో కాదు !

నేను అన్నాడీఎంకే పార్టీలో సాదారణ కార్యరక్తగా అడుగుపెట్టానని, జయలలిత ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని, సీఎం అయ్యానని, నేను క్రమశిక్షణతో పార్టీలో పని చెయ్యడం వలనే అది సాధ్యం అయ్యిందని, ఎవరో నన్ను ఈ స్థాయికి తీసుకురాలేదని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. కొందరు పార్టీ పదవులు అనుభవించి (పన్నీర్ సెల్వం) తరువాత పార్టీకి ద్రోహం చెయ్యాలని ప్రయత్నించారని ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.

బోడప్పలు ఉంటే ఎంత... పోతే ఎంత?

బోడప్పలు ఉంటే ఎంత... పోతే ఎంత?

అమ్మ జయలలిత మనకు వదిలి వెళ్లిన మన అన్నాడీఎంకే పార్టీని సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నారని, అలాంటి బోడప్పలు పార్టీలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ఎడప్పాడి పళనిస్వామి ఆవేశంతో ఊగిపోయారు. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆవేశంగా మాట్లాడుతున్న సమయంలో పన్నీర్ సెల్వం వర్గీయులు కుర్చీలకు గాల్లోకి విసిరేసి నానా హంగామా చేశారు. ఈ సందర్బంగా చెన్నై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Party War: Edappadi Palanisamy latest speech in AIADMK genral committe meeting in Chennai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X