లేట్‌గా కట్ చేసినా..లేటెస్ట్‌గా: హీరోయిన్, మూవీ టీమ్: ఫ్లయిట్‌లోనే రజినీకాంత్ బర్త్‌డే
హైదరాబాద్: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రూటే సపరేటు. ఆయన లేట్‌గా చేసినా అది లేటెస్ట్‌గానే ఉంటుంది. మొన్నటికి మొన్నే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించిన ఆయన.. చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసుకుని.. పాలిటిక్స్ మీద ఫోకస్ చేయాలనేది రజినీకాంత్ ప్లాన్. అందుకే- షూటింగ్‌లను కొనసాగించడానికి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వట్లేదు.
ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న మూవీ.. అన్నాత్తే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్ శివార్లలోని ఫిల్మ్‌సిటీలో ప్లాన్ చేశారు. దీనికోసం రజినీకాంత్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరారు. తన కుమార్తె ఐశ్వర్య, హీరోయిన్ నయనతార, మూవీ యూనిట్‌తో కలిసి ఆయన జర్నీ చేశారు. అంతకుముందు రోజే రజినీకాంత్ బర్త్‌డే. 24 గంటల తరువాతే అయినప్పటికీ.. మిడ్ ఎయిర్‌లో పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు.

ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్, మూవీ యూనిట్ సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఐశ్వర్య, నయనతార, చిత్ర యూనిట్ సభ్యులు, ఫ్లయిట్ సిబ్బంది మధ్య ఆయన ఆనందోత్సాహాలతో పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను వేలాదిమంది తిలకించారు. సుమారు తొమ్మిదినెలల తరువాత రజినీకాంత్ షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టారు. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ ఈ మూవీని నిర్మిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, సూరి నటిస్తున్నారు. శివ దర్శకుడు.
Recommended Video
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications