Sadist: సైకో తండ్రి, ఒక కూతురు ఆత్మహత్య, ఇద్దరు కూతుర్లను ఒకేసారి కొట్టి చంపేశాడు, అసలు మ్యాటర్!
చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న దంపతులు పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉన్నారు. దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, మద్యంకు బానిస అయిన భర్త అతని భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. తండ్రి కారణంగా ముగ్గురి కూతుర్ల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు
తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని ఒరగడాం ప్రాంతంలో గోవిందరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గోవింరాజు సెల్వీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న గోవిందరాజు, సెల్వి దంపతులు పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉన్నారు.

ముగ్గురు కూతుర్లు
గోవింరాజు, సెల్వి దంపతులకు నందిని (16), నదియా (14), దీపా (8) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రానురాను గోవింరాజు, సెల్వి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి, మద్యంకు బానిస అయిన గోవింరాజు ప్రతిరోజు మద్యం సేవించి వెళ్లి అతని భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఎలాంటి పనిపాట చెయ్యకుండా భార్య సంపాదన మీద ఆధారపడుతున్న గోవింరాజు మద్యం మత్తులో కాలం గడిపేస్తున్నాడు.

తండ్రి దెబ్బతో ఆత్మహత్య చేసుకున్న కూతురు
తండ్రి చిత్రహింసలు భరించలేని 14 ఏళ్ల కూతురు నదియా గత నెలలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు నుంచి ఇంకా విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వెలుతున్న గోవింరాజు అతని భార్య, ఇద్దరు కూతుర్లు నందిని, దీపాకు నరకం చూపిస్తున్నాడు. మద్యం మత్తులో గోవింరాజు ఏం చేస్తున్నాడో అనే విషయం అతనికే తెలీకుండా పోయింది.

ఇద్దరు కూతుర్లను కొట్టి చంపేసిన తండ్రి
రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన గోవింరాజు కర్ర తీసుకుని ఇంటర్ చదువుతున్న నందినిని, 9 ఏళ్ల కూతురు దీపాను చితకబాదేశాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో నందిని, దీపా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు కూతురళ్లను చంపేసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన గోవింరాజు పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.