Shock: డ్రైనేజ్ లో శవమైన బిగ్ షాట్, రాత్రి భార్యకు ఫోన్, భార్య అకౌంట్ లో డబ్బులు డ్రా చేసింది ఎవరు ?
చెన్నై/టీ నగర్: ప్రముఖ వ్యాపారవేత్త అతని వ్యాపారం చూసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. వ్యాపారం పనిమీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. వ్యాపారం పనిమీద బయటకు వెళ్లిన ఆయన రాత్రి సిటీకి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి వెళ్లకుండా బయట ఉన్నాడు. భార్యకు ఫోన్ చేసిన వ్యాపారవేత్త రాత్రి ఇంటికి రావడానికి లేటు అవుతోందని, నువ్వు భోజనం చేసి నిద్రపోవాలని చెప్పాడు. మరుసటి రోజు శ్రీమంతులు ఉండే ఏరియాలో ఆ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. విషయం గుర్తించిన పారిశుద్ద కార్మికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

ప్రముఖ వ్యాపారవేత్త
చెన్నైలోని ఆదంబాక్కం ఏరియాలో భాస్కరన్ (67) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. చెన్నైలో వైబ్రేషన్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ నిర్వహిస్తున్న భాస్కర్ ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు సంపాధించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన భాస్కర్ చెన్నై సిటీలో, బయట సిటీల్లో ఉన్న అతని వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉంటున్నాడు.

భార్యకు ఫోన్ చేసి మాట్లాడిన వ్యాపారి
వ్యాపారం పనిమీద భాస్కరన్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. రెండు రోజుల క్రితం భాస్కరన్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. వ్యాపారం పనిమీద బయటకు వెళ్లిన భాస్కరన్ శుక్రవారం రాత్రి చెన్నై సిటీకి వెళ్లాడు. అయితే భాస్కరన్ రాత్రి ఇంటికి వెళ్లకుండా బయట ఉన్నాడు. భార్యకు ఫోన్ చేసిన వ్యాపారవేత్త భాస్కరన్ రాత్రి ఇంటికి రావడానికి లేటు అవుతోందని, నువ్వు భోజనం చేసి నిద్రపోవాలని చెప్పాడు.

కాలువలో శవమైన వ్యాపారి
శనివారం ఉదయం విరుగంపాక్కంలో చెన్నై సిటీ పారిశుద్ద కార్మికులు చెత్త శుభ్రం చేస్తున్నారు. ఆ సందర్బంలో కాలువలో ఓ శవం చూసిన పారిశుద్ద కార్మికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీమంతులు ఉండే ఏరియాలో వ్యాపారవేత్త భాస్కరన్ దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

భార్య ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసింది ఏవరు ?
భాస్కరన్ శవం గుర్తించిన పారిశుద్ద కార్మికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. అయితే భాస్కరన్ ను ఎవరు హత్య చేశారు ? అనే విషయం అంతుచిక్కడం లేదని పోలీసులు అన్నారు. రాత్రి 10.40 గంటల నుంచి 10.50 గంటల మధ్యలో భాస్కరన్ భార్య అకౌంట్ ఏటీఎంకార్డులో భారీ మొత్తంలో నగదు డ్రా చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications